Mohammed Shami: నా కంటే ఏ క్రికెటర్ ఎక్కువ బరువు ఎత్తలేడు.. కానీ చెప్పుకోను: మహమ్మద్ షమీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammed Shami Said Iam Strongest Cricketer In The World: జిమ్‌లో తన కంటే ఎక్కువ బరువును ఏ క్రికెటర్ ఎత్తలేడని టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ తెలిపాడు. ప్రపంచ క్రికెట్లో అత్యంత బలమైన ఆటగాడని తానే అని పేర్కొన్నాడు. లెగ్ ప్రెస్ ఎక్సర్సైజ్లో 750 కిలోల వరకు బరువు ఎత్తగలనని షమీ చెప్పాడు. దీని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తనకు ఇష్టం లేదని, అందుకే ప్రజలకు ఈ విషయం తెలియదని షమీ చెప్పుకొచ్చాడు. లెగ్ ప్రెస్ ఎక్సర్సైజ్లో బాడీబిల్డర్ పాల్ మీకర్ 1,367 కిలోల బరువును ఎత్తాడు. ఇప్పటివరకు ఇదే ప్రపంచ రికార్డు.
వన్డే ప్రపంచకప్ 2023 అనంతరం మహమ్మద్ షమీ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లకు దూరంగా ఉన్నాడు. మరికొన్ని రోజుల్లో దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్ కోసం సఫారీ గడ్డకు షమీ బయలుదేరనున్నాడు. ప్రపంచకప్ 2023లో 7 మ్యాచ్‌ల్లోనే 24 వికెట్లు తీసి అత్యధిక వికెట్ల తీసిన బౌలర్‌గా నిలిచిన షమీ.. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్‌కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
Also Read: IPL Auction 2024: ఆ ఆటగాళ్లకు భారీ ధర పక్కా.. ఆర్ అశ్విన్ జోస్యం!
ఆధునిక క్రికెట్లో క్రికెటర్లకు ఫిట్నెస్ తప్పనిసరి అయింది. ప్రతిఒక్కరు ఫిట్‌గా ఉండటానికి ఎంతో శ్రమిస్తున్నారు. మహమ్మద్ షమీ ఫిట్‌గా ఉండటానికి జిమ్‌లో ఎంత కష్టపడుతున్నాడో వెల్లడించాడు. ‘జిమ్‌లో నా కంటే ఎక్కువ బరువును మరే క్రికెటర్ ఎత్తడు. నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ఇష్టపడను కాబట్టి ప్రజలకు ఈ విషయం తెలియదు. నేను 750 కిలోల లెగ్ ప్రెస్ చేయగలను’ అని ఆజ్ తక్‌తో షమీ చెప్పాడు. గతంలో షమీ చిన్ననాటి కోచ్ బద్రుద్దీన్ సిద్ధిఖీ.. టీమిండియా పేసర్ ఫిట్నెస్ ప్రయాణం గురించి మాట్లాడాడు. ఫిట్నెస్ను మెరుగుపరచుకోవడానికి షమీ తన ఫామ్‌హౌస్‌లో ఎంత కష్టపడతాడు అని వెల్లడించాడు.
Mohammed Shami said, “no other cricketer lifts heavier weights than me in the gym, I don’t like to post on social media so people don’t know. I can do a 750KG leg press”. (Aaj Tak). pic.twitter.com/Ppxkgtqt8m
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 14, 2023
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!