Moeen Ali : భారత దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ చివరి సీజన్లో ఆడుతున్నాడని క్రికెట్ ప్రపంచంలో చర్చ జరుగుతోంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్లో ధోనీ కెప్టెన్సీ, బ్యాటింగ్‌ను చూసి చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన తోటి ప్లేయర్ మొయిన్ అలీ వచ్చే ఏడాది కూడా ఐపీఎల్ ఆడతాడని జోస్యం చెప్పాడు.
Read Also: IPL: నేడు ముంబైతో హైదరాబాద్ ఢీ.. ఉప్పల్ స్టేడియానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
మొయిన్ అలీ మాట్లాడుతూ ‘ నెట్స్‌లో ధోని బ్యాటింగ్ చేయడం నేను చూశాను. రాజస్థాన్‌పై అతని ఇన్నింగ్స్ నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ప్రస్తుతం ధోనీ వయసు 41. ఈ వయసులో కూడా అతను శక్తివంతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇది అభినందనీయం. అంతే కాదు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కి వస్తాడు. ఈ వయసులో లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చి దూకుడుగా బ్యాటింగ్ చేయడం అంత తేలికైన విషయం కాదు. వచ్చే ఏడాది కూడా తప్పకుండా ఆడతాడు’.
Read Also: Atiq Ahmed: అతిక్ అహ్మద్ హత్య ఎవరికి లాభం.. ఐఎస్ఐ కుట్ర దాగుందా..?
ఈ ఏడాది భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌పై మొయిన్ అలీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇది తన చివరి వన్డే అని అతను చెప్పాడు. ఈ మ్యాచ్ లు భారత్‌లో జరగనున్నాయి. ఇక్కడ స్పిన్నర్లు మ్యాచులో ముఖ్య పాత్ర పోషిస్తారు. అందువల్లే తన భుజాలపై పెద్ద బాధ్యత ఉందన్నారు. ఈ టోర్నీలో తనకు, జట్టుకు మంచి జరగాలని కోరుకుంటున్నా అన్నారు. టైటిల్‌ను నిలబెట్టుకోవాలని మొయిన్ అలీ పట్టుదలతో ఉన్నాడు.