Modi Xi Jinping Meeting: సరిగ్గా ఏడేళ్ల సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ కలిసి కనిపించారు. అగ్రరాజ్యం అమెరికా ప్రతీకార సుంకాల మధ్య ఈ పరిణామం ప్రపంచ రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టించింది. ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ల మధ్య సమావేశానికి చైనాలోని టియాంజిన్‌లో జరిగిన SCO శిఖరాగ్ర సమావేశం వేదిక అయ్యింది. ఈ సమావేశంలో ఇద్దరు నాయకుల మధ్య దాదాపు 50 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో కైలాష్ మానస సరోవర్ యాత్ర, ఇరుదేశాల సరిహద్దు ఒప్పందం, వ్యాపార సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం.
READ ALSO: Anushka : అనుష్క వాళ్లకు భయపడి బయటకు రావట్లేదా..?
ఏడేళ్ల తర్వాత..
ఆత్మీయ స్వాగతం పలికినందుకు చైనా అధ్యక్షుడికి భారత ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఈ ద్వైపాక్షిక సంభాషణలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘గత ఏడాది మేము కజాన్‌లో అర్థవంతమైన చర్చను నిర్వహించాము. ఆ సమావేశం ఇరుదేశాల సంబంధాలలో సానుకూల పవనాలను వీచేలా చేసింది. సరిహద్దులో సైనికుల ఉపసంహరణ శాంతి వాతావరణాన్ని సృష్టించింది. కైలాష్ మానసరోవర్ యాత్ర మళ్లీ ప్రారంభమైంది. రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాలు కూడా పునరుద్ధరించనున్నాం. సుమారు 2.8 బిలియన్ల ప్రజల ప్రయోజనాలు ఇరుదేశాల సహకారంతో ముడిపడి ఉన్నాయని, ఈ సమావేశం మొత్తం మానవాళి సంక్షేమానికి మార్గం సుగమం చేస్తుంది’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మోడీని కలవడం సంతోషంగా ఉందని చెప్పారు. రెండు దేశాలు పురాతన నాగరికతలు కలిగి ఉన్నాయని గుర్తు చేశారు. ‘ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు భారత్- చైనా. తాము గ్లోబల్ సౌత్‌లో కూడా ముఖ్యమైన సభ్య దేశాలం. రెండు దేశాలు ఒకరి విజయానికి ఒకరు సహాయపడే భాగస్వాములుగా మారడం సరైనదే. డ్రాగన్ – ఏనుగు కలిసి వస్తాయి. మన ప్రజల సంక్షేమం కోసం అవసరమైన సంస్కరణలను తీసుకురావడానికి, మానవ సమాజ పురోగతిని ప్రోత్సహించడానికి ఇరు దేశాలకు చారిత్రాత్మక బాధ్యత ఉంది’ అని అన్నారు.
ఈ సమావేశంపై పలువురు నిపుణులు మాట్లాడుతూ.. డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు రెండు దేశాలను కదిలించిందని అన్నారు. దీంతో చైనా భారతదేశంతో చేతులు కలపడం ద్వారా గ్లోబల్ సౌత్‌ను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ వాణిజ్య యుద్ధాన్ని నిలువరించడానికి, ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలు తెరుచుకునేలా చైనా భారతదేశాన్ని దగ్గరకు తీసుకోవాలని ఆశిస్తుందని చెబుతున్నారు. చైనాను పూర్తిగా విశ్వసించలేమని వారు అన్నారు. జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను ఐక్యరాజ్యసమితిలో రక్షించడం, టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంలో అడ్డంకులు సృష్టించడం వంటి చర్యలు.. ఇండియా డ్రాగన్ పట్ల జాగ్రత్తగా ఉండేలా చేస్తున్నాయని అన్నారు. ఇటువంటి పరిస్థితిలో టియాంజిన్‌లో మోడీ-జిన్‌పింగ్ సమావేశం భారతదేశం-చైనా సంబంధాలలో కొత్త ప్రారంభానికి సంకేతంగా నిలుస్తుందన్నారు. కానీ ఈ స్నేహ మార్గంలో కూడా జాగ్రత్త అవసరం అన్నారు. జిన్‌పింగ్ ఈ హృదయపూర్వక స్వాగతం కచ్చితంగా కొత్త స్నేహానికి సందేశాన్ని ఇస్తోంది.. కానీ ఈ మార్గంలో కూడా అనేక సవాళ్లు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
READ ALSO: Nalanda Crime: నలందలో కాల్పుల కలకలం.. 18 ఏళ్ల యువకుడు మృతి