NTV Telugu Site icon

MODI: మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మోడీ.. ఎప్పుడంటే?

New Project (41)

New Project (41)

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీయే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే గత రెండు ఎన్నికల మాదిరిగానే ఈసారి బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది. కానీ ఎన్డీయే 292 సీట్లు గెలుచుకుంది. దీంతో కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కానుంది. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును కూడా మోడీ సమం చేశారు.

READ MORE: Uttarkashi: దారి తప్పి నలుగురు పర్వతాధిరోహకుల మృతి..రంగంలోకి రెస్క్యూ టీం

జూన్ 8 న మూడవ సారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకరం చేయనున్నారు. జూన్ 8 సాయంత్రం కేంద్రంలో నూతన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఈ రోజు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు సమావేశం ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగింది. జూన్ 7 మధ్యాహ్నం బీజేపీ ఎంపీలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీఏ అధికారికంగా నాయకుడి ఎన్నిక జరుగుతుంది. జూన్ 8 న బిజేపి నేతృత్వంలో కూటమి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

READ MORE: CM Revanth: బీజేపీ గెలిచిన 8 చోట్ల బీఆర్ఎస్ 7 చోట్ల డిపాజిట్ కోల్పోయింది..

లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీయే కూటమిలో జేడీయూ అధినేత నితీశ్ కుమార్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కీ రోల్ పోషించబోతున్నారు. బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో చంద్రబాబు, నితీశ్ లు కింగ్ మేకర్లుగా మారిపోయారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి ఈ నేతల మద్దతు కమలం పార్టీకి తప్పనిసరి అయింది. కాగా, ఎన్నికల ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో ఈ నేతలు ఇద్దరూ చేరారు. తొలుత ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించిన నితీశ్ కుమార్.. లాస్ట్ మినిట్ లో ఎన్డీయే గూటికి జంప్ అయ్యారు. ఈ క్రమంలో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు ఇటు ఎన్డీఏ, అటు ఇండియా కూటమి సమావేశాలను ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం ఎన్డీఏ నేతల సమావేశం జరుగుతోంది. మరి కొద్ది సేపట్లో కీలక ప్రకటన విడుదల కాబోతోంది.