ASEAN Summit: కౌలాలంపూర్ లో ఆసియన్ సదస్సు.. వర్చువల్ గా పాల్గొననున్న మోడీ
- అక్టోబర్ 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆసియాన్ సదస్సు
- ప్రతి ఏటా సదస్సులో పాల్గొననున్న ప్రధాని మోడీ
- ఈ సారి వర్చువల్ గా పాల్గొననున్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ASEAN Summit: మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో అక్టోబర్ 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆసియాన్ సదస్సు జరగనున్నది. ప్రతి ఏటా ఈ సదస్సుకు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఈసారి హాజరవుతారు. కానీ ఈసారి ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కావడంలేదని.. కేవలం వర్చువల్ గా హాజరవుతానని ఎక్స్ లో తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కూడా భేటీ రద్దు అయినట్లు సమాచారం. ట్రంప్ కూడా ఈ సదస్సుకు హాజరవుతున్నట్లు ప్రకటించిన కొన్ని గంటలకే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జరిగే 22వ ఆసియాన్ – ఇండియా సమ్మిట్‌లో వర్చువల్‌గా పాల్గొంటారు. ప్రధానమంత్రి మోదీ , ఆసియాన్ నాయకులు సంయుక్తంగా ఆసియాన్-భారత్ సంబంధాలలో పురోగతిని సమీక్షిస్తారని, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి చొరవలను చర్చిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆసియాన్‌తో సంబంధాన్ని బలోపేతం చేసుకోవడం భారతదేశం యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఇండో-పసిఫిక్ దార్శనికతకు కీలక స్తంభమని పేర్కొంది. ఈ నిర్ణయంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోదీకి సాధ్యమయ్యే ద్వైపాక్షిక భేటీపై గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మొదట్లో ప్రధాని మోదీ కౌలాలంపూర్‌తో పాటు కంబోడియాలో కూడా పర్యటించాలనుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆ సదస్సుకు వెళ్లకపోవడత.. కంబోడియా పర్యటన కూడా వాయిదా పడింది.
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్‌పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
ఈ సమ్మిట్ లో ప్రధాని మోదీకి బదులు విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ భారత దేశానికి ప్రాతినిద్యం వహించనున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రధాని మోదీయే స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ఫోన్లో ఆత్మీయ సంభాషణ జరిపిన అనంతరం.. మోదీ మలేసియాకు ఆసియాన్ ఛైర్మన్‌షిప్ లభించినందుకు అభినందించారు. “ఆసియాన్-ఇండియా సదస్సుకు వర్చువల్‌గా హాజరు అయ్యేందుకు ఎదురు చూస్తున్నాను. ఆసియాన్-ఇండియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఆశిస్తున్నాను” అని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు.
Had a warm conversation with my dear friend, Prime Minister Anwar Ibrahim of Malaysia. Congratulated him on Malaysia’s ASEAN Chairmanship and conveyed best wishes for the success of upcoming Summits. Look forward to joining the ASEAN-India Summit virtually, and to further…
— Narendra Modi (@narendramodi) October 23, 2025
- Tags
తాజావార్తలు
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్‌లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్‌గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్‌కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..