PM Modi Funny Moment: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపక్షాలపై మాటల తూటాలను పేల్చడం చూసి ఉంటారు.. కానీ ఆయన సరదాగా అందరి మోములపై నవ్వులు పూయించడం ఎప్పుడైనా చూశారా.. ఆయన తాజాగా తన హాస్య చతురతతో వార్తల్లోకి ఎక్కారు. మంగళవారం న్యూఢిల్లీలో సెమికాన్ ఇండియా 2025 ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ప్రధాని మోడీ సభలోని వారందరితో నవ్వులు పూయించారు.
READ ALSO: Uttar Pradesh: మూడు విశ్వవిద్యాలయాలలో 468 కాంట్రాక్ట్, 480 అవుట్సోర్సింగ్ పోస్టులకు ఆమోదం
ఏం జరిగిందంటే..
న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో సెమికాన్ ఇండియా 2025 ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రధాని మోడీ హాజరై మాట్లాడారు.. “లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను నిన్న రాత్రి జపాన్, చైనాలను సందర్శించి తిరిగి వచ్చాను’ ఆయన ఇలా చెప్పగానే, అక్కడున్న సభికులందరూ చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. దీనిపై ప్రధాని మోడీ చమత్కారంగా మాట్లాడుతూ… “నేను వెళ్లానని చెప్పి మీరు చప్పట్లు కొడుతున్నారా లేదా నేను తిరిగి వచ్చానని చెప్పి చప్పట్లు కొడుతున్నారా” అని అన్నారు. ప్రధాని మాటలతో హాలు చప్పట్లతో మారుమోగింది. కార్యక్రమంలో పాల్గొన్న విదేశీ ప్రతినిధులు కూడా తమ నవ్వును ఆపుకోలేకపోయారు. ప్రధాని మోడీకి అత్యంత తీవ్రమైన వాతావరణాన్ని కూడా తేలిక పరచగల నాయకుడని పేరుంది. గతంలోనూ ప్రధాని ఇలాగే సభికులందరితో నవ్వులు పూయించిన పలు సందర్భాలు ఉన్నాయి.. కొన్నేళ్ల క్రితం ప్రధానమంత్రి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. “ఒకసారి ఎవరో నన్ను మీ ముఖం ఎందుకు అంత మెరుస్తున్నదని అడిగారు? అప్పుడు నా శరీరం నుంచి చాలా చెమట వస్తుందని సమాధానం చెప్పాను. నేను ఆ చెమటతోనే మసాజ్ చేస్తానని, అందుకే నా ముఖం మెరుస్తుంది” అని చెప్పినట్లు పేర్కొన్నారు.
ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు జపాన్, చైనాలలో 4 రోజుల పర్యటన తర్వాత ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. చైనాలో ఆయన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్లతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.
READ ALSO: పావురాల గుట్టలో ఆ రోజు నిజంగా ఏం జరిగింది..? వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం నిజాలు