Farmers : రైతులకు శుభవార్త.. ఎరువులపై రూ.24,420కోట్ల సబ్సిడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers : పంజాబ్-హర్యానా సరిహద్దులో రైతులు తమ డిమాండ్‌లను నెరవేర్చాలంటూ పోరాటాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఎన్నికలకు ముందు ప్రభుత్వం రైతుల కోసం పెద్ద ప్రకటన చేసింది. ఖరీఫ్ నాట్లు సందర్భంగా రైతులకు ఎరువులపై ప్రభుత్వం భారీ రాయితీ ఇస్తుంది. ఇందుకోసం రూ.24,420 కోట్ల బడ్జెట్‌కు గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఖరీఫ్ పంటకు ఫాస్ఫేటిక్, పొటాష్ (పీ అండ్ కే) ఎరువులపై మొత్తం రూ.24,420 కోట్ల సబ్సిడీకి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో రైతులు ఉపయోగించే ప్రధాన ఎరువులైన డీఏపీ క్వింటాల్‌కు రూ.1,350 ధరకే అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.
Read Also:Bangladesh Fire Accident: బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 44 మంది మృతి!
Also Read
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
డిఎపి (డి-అమోనియం ఫాస్ఫేట్), పి అండ్ కె ఎరువుల రిటైల్ ధరలు స్థిరంగా ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు పి అండ్ కె ఎరువులపై సబ్సిడీ అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం ‘న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ’ (ఎన్‌బిఎస్) రేట్లను నిర్ణయించాలన్న ఎరువుల శాఖ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సమాచారం అందించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఖరీఫ్ పంటకు నత్రజని (ఎన్) కిలోకు రూ.47.02, ఫాస్ఫేట్ (పి) కిలో రూ.28.72, పొటాష్ (కె) కిలో రూ.2.38, సల్ఫర్ (ఎస్)పై సబ్సిడీ రూ. కిలో రూ.1.89గా నిర్ణయించారు.
Read Also:LPG Price Hike : సామాన్యులకు షాక్.. రూ.25పెరిగిన సిలిండర్ ధర
ఫాస్ఫేటిక్ ఎరువులపై సబ్సిడీని 2023లో రబీ పంటకు కిలోకు రూ. 20.82 నుంచి 2024 ఖరీఫ్ సీజన్‌కు కిలోకు రూ.28.72కి పెంచారు. అయితే, ఖరీఫ్ పంట 2024 కోసం నత్రజని (N), పొటాష్ (K) , సల్ఫర్ (S) పై సబ్సిడీలో ఎటువంటి మార్పు లేదు. ఈ సబ్సిడీతో పాటు డిఎపి (డి-అమ్మోనియం ఫాస్ఫేట్) బస్తాకు రూ. 1,350 (50 కిలోలు) చొప్పున విక్రయించబడుతోంది. రాబోయే ఖరీఫ్ పంటలో కూడా స్థిరంగా ఉంటుంది. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (ఎంఓపీ) కూడా ఒక్కో బ్యాగ్‌కు రూ.1,670, ఎన్‌పీకే రూ.1,470 చొప్పున అందుబాటులో ఉంటాయి. డిఎపిపై దిగుమతి ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఎన్‌బిఎస్ పథకం కింద మూడు కొత్త ఎరువుల గ్రేడ్‌లను చేర్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎరువుల కంపెనీలకు నిర్ణీత ధరల ప్రకారం సబ్సిడీ ఇవ్వడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూస్తామన్నారు.
తాజావార్తలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!