Amit Shah On Terrorism: త్వరలోనే జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు.. ఆ ఉగ్రవాద సంస్థలను నిషేధించాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu & Kashmir: యాసిన్ మాలిక్ ఉగ్రవాద సంస్థ జేకేఎల్‌ఎఫ్‌పై విధించిన నిషేధాన్ని వచ్చే ఐదేళ్ల పాటు పొడిగిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ (శనివారం) ఉత్తర్వులు జారీ చేసింది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే కార్యకలాపాల్లో జేకేఎల్‌ఎఫ్ (యాసిన్ మాలిక్ వర్గం) నిమగ్నమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. యాసిన్ మాలిక్‌తో పాటు హోం మంత్రిత్వ శాఖ JKPL (ముక్తార్ అహ్మద్ వాజా), JKPL (బషీర్ అహ్మద్ తోట), JKPL (గులాం మహమ్మద్ ఖాన్), JKPL (అజీజ్ షేక్) వర్గాలను కూడా నిషేధించినట్లు కేంద్ర హోంమంత్ర్వశాఖ వెల్లడించింది. దేశ భద్రత, సార్వభౌమాధికారం, సమగ్రతకు ఎవరైనా సవాలు విసిరితే చట్టపరంగా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమిత్ షా అన్నారు. వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు గానూ మోడీ ప్రభుత్వం ‘జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ ఫ్రీడమ్ లీగ్’ని నిషేధిత గ్రూపుగా ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు.
Read Also: Uttarpradesh : తమ్ముడు, అతడి భార్య వేధింపులు భరించలేక ప్రైవేట్ పార్టు కోసుకున్న వ్యక్తి
Also Read
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
- Cristiano Ronaldo: అర్జెంటీనాపై వివాదాస్పద పోస్ట్‌ను రొనాల్డో లైక్ చేశారా? సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ..
- Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
- Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్‌కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
ఇక, భారత ఎన్నికల సంఘం వచ్చే లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించనున్న తరుణంలో హోం మంత్రిత్వ శాఖ వేగంగా చర్యలు చేపట్టింది. ఈరోజు కొన్ని రాష్ట్రాల లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్నారు. జమ్మూకశ్మీర్‌లో కూడా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా, మార్చి 12 వ తేదీన మోడీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ నేషనల్ ఫ్రంట్‌ను చట్టవిరుద్ధమైన గ్రూపుగా పేర్కొంటూ నిషేధించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం నాడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ ( X )లో ఒక పోస్ట్‌లో ఈ విషయాన్ని తెలిపారు. భారతదేశ ప్రజలు ఉగ్రవాద శక్తులను నిర్మూలించడానికి కట్టుబడి ఉన్నారు అంటూ అమిత్ షా వెల్లడించారు.
Pursuing PM @narendramodi Ji's policy of zero-tolerance towards terrorism, the MHA has declared four factions of the Jammu and Kashmir Peoples League—namely, JKPL (Mukhtar Ahmed Waza), JKPL (Bashir Ahmad Tota), JKPL (Ghulam Mohammad Khan) and JKPL (Aziz Sheikh) led by Yaqoob…
— Amit Shah (@AmitShah) March 16, 2024
తాజావార్తలు
-
Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
-
Cristiano Ronaldo: అర్జెంటీనాపై వివాదాస్పద పోస్ట్‌ను రొనాల్డో లైక్ చేశారా? సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ..
-
Adluri Laxman : అధికారంలో ఉన్నప్పుడు రైతులు కనిపించలేదా..!
-
Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
-
Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్‌కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!