మరో మహా భారతం !
ఒకటా ? రెండా ?
వరుస అవమానాలు .. అన్యాయాలు ..
ఇంటికి నిప్పు పెట్టారు .. నిండు సభలో ఘోరంగా అవమానించారు .. రాజ్యం లాగేసుకున్నారు ..అడవుల పాలు చేసారు ..
అయినా పాండవులు కయ్యానికి కాలు దువ్వలేదు .
రాయబారాలు పంపారు ..
“యుద్ధం వద్దు .. కనీసం అయిదు ఊళ్ళు ఇవ్వు “అన్నారు .
పోగాలము దాపురించిన వాడు మంచి వారి మాటలు వినడు .
చివరకు యుద్ధం అనివార్యం అయ్యింది .
18 రోజులు ..
చివరకు మడుగులో దాక్కున్నాడు దుర్యోధనుడు ..
నాశనాన్ని కొని తెచ్చుకొన్నాడు .
ఇదీ మహాభారత చరిత్ర క్లుప్తంగా.
ఇక ఆధునిక చరిత్ర .
పాకిస్థాన్ .. ఇదో విష బీజ చెట్టు .
పుట్టుకే ద్వేష ప్రాతిపదికన ..
మనుగడ మొత్తం ద్వేషం తో ..
బ్రిటిష్ వాడి విభజించు పాలించు .. అనే సూత్రం .. ఆనాటి మన పాలకుల శాంతి కాముక విధానాలు .. ఏదైతేనేమి మత ద్వేషం తో దేశం పుట్టింది .
భారతదేశం లో మా మతస్తులకు తావు లేదు అన్నారు ..
ఇదో పెద్ద అబద్దం అని ఇన్నాళ్ల చరిత్ర రుజువు చేసింది .
అన్ని మతాలు కలిసి ఇక్కడ సహజీవనం చేసారు .. చేస్తున్నారు .. చేస్తారు .
దేశం ఏర్పడింది .
అప్పటికైనా తమ పని తాము చూసుకొన్నారా?
జనాలకు తినడానికి గోధుమ పిండి దొరకని స్థితికి దేశాన్ని దిగజార్చారు .
అదో ఫెయిల్డ్ స్టేట్ .విఫల రాజ్యం
నిజానికి రాజ్యం అనలేము .
ఎవరికీ వారే యమునా తీరే..
ఎన్నికైన ప్రభుత్వం నిలవదు .
మిలిటరీ నాయకులు టెర్రరిస్ట్ లు కలిసి రాజ్యాధికారాన్ని పంచుకొన్న దేశం ..
“ఇండియా పై పాక్ విజయం” .
ఈ మాటలు .. ఒక్క క్రికెట్ చరిత్రలోనే సాధ్యం అయ్యింది .
అదీ ఇమ్రాన్ ఖాన్ క్రికెట్ కెప్టెన్ గా వున్నప్పుడు ..
ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ఎక్కడ ?
జైలు లో ..
ఈ ఒక్క ముక్క చాలు పాకిస్థాన్ పరిస్థితి అర్థం చేసుకోవడానికి .
ఇమ్రాన్ ఖాన్ శుద్ధ పూస అని చెప్పడం లేదు .
కానీ ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉండాల్సి వస్తే ఆ దేశంలో మొత్తం నాయకత్వం ఎప్పుడో ఉరికంబం ఎక్కివుండాలి .
అవునా ? కాదా?
ఒకటా ? రెండా ?
మన దేశం పై ఎన్ని అఘాయిత్యాలు ?
కాంగ్రెస్ .. జనతా పార్టీ .. నేషనల్ ఫ్రంట్ .. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ … డెమోక్రాటిక్ అలయన్స్ .. బీజేపీ ..
దేశాన్ని ఏలిన పార్టీ లు .. పార్టీ ల కూటములు .
ఒక్క సారైనా మన దేశం నుంచి పాకిస్థాన్ కు వెళ్లి వారి పౌరులను చంపిన ఉదంతం ఉందా ?
వారి కుట్రలు .. కుతంత్రాలు ఎప్పుడైనా ఆగాయా?
కార్గిల్ .. ముంబై .. చివరాఖరికి పార్లమెంట్ పై దాడి .
ఒక పక్క తిండికి లేదు .. అప్పు పుట్టడం లేదు .. ఏమి చెయ్యాలి ?
అది ప్రజల కోసం పుట్టిన రాజ్యం కాదు . దాని అజెండా విధ్వంసం .
కాశ్మీర్ లోయలో పేర్లు అడిగి మరీ చంపేశారు .
అంటే .. ఇక మాటల్లేవ్ .. మాట్లాడుకోడాలు లేవు .
అయినా సింధూర పేరుతొ భారతదేశం కేవలం టెర్రరిస్ట్ క్యాంపు ల పై దాడి చేసింది . అదీ మన దేశానికి చెందిన .. వారు ఆక్రమించుకున్న ప్రాంతం లోని టెర్రరిస్ట్ క్యాంపు ల పై .
అప్పుడైనా కళ్ళు తెరిచారా?
అసలు ఈ ప్రశ్న తప్పు .
అది దేశం అయితే కదా?
మనకు ఒక ప్రభుత్వం ఉంది..
అయినా అఖిల పక్షం ఏర్పాటు చేసారు ..
రాష్ట్రపతికి వివరించారు .
త్రివిధ దళాలు ప్రభుత్వ కమాండ్ మేర పని చేస్తున్నాయి .
అక్కడ ఇదేమీ లేదు .
అదో అవ్యవస్తీకృత దొంగల గుంపు .. అంతే ..
మనం టెర్రరిస్ట్ ల పై దాడి చేస్తే .. వారు ప్రతిగా తొమ్మిది పట్టణాలపై దాడి కి యత్నించారు . ఇరవై దాక సామాన్య ప్రజలను పొట్టన పెట్టుకొన్నారు .
అదిగో అప్పుడు మొదలయ్యింది యుద్ధం .
నిన్న రాత్రి మొదలయి పోయింది
మహా భారత యుద్ధం 18 రోజులు సాగింది .
ఈ యుద్ధం ఎన్ని రోజులు సాగుతుందో చెప్పలేము ..
కానీ ఒక్క రాత్రిలోనే చావు దెబ్బ తీసింది భారత్ .
పాకిస్థాన్ సామాన్య ప్రజల్లో తిరుగుబాటు .. బలూచిస్తాన్ లో తిరుగుబాటు .. పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడి నే అరెస్ట్ చేసిన వారి ఆర్మీ .. వారి యుద్ధ విమానాల .. రాడార్ వ్యవస్థల కూల్చివేత .. ఇస్లామాబాద్ దాక .. కరాచీ దాక మన సైనిక వ్యవస్థల చేరిక ……ఇంకా… చాలా… చాలా శరవేగంతో జరిగిపోయాయి .
ఈ రోజు ఎనిమిది గంటలకు మన ప్రభుతం అధికారికంగా చెప్పేదాకా వెయిట్ చేద్దాము .
ఇప్పుడిక దారి ఏది ?
చైనా ను నమ్ముకుంటే వారు ముందుకు రావడం లేదు .
సౌదీ అరేబియా లాంటి దేశాల దౌత్యం తో భారత్ తో రాజీ కి రావడమే .
అణుబాంబులు వున్నాయి కదా తెగపడుదాము .. భయపెడుదాము అనుకొన్నారు .. పక్కనే ఉన్న అమృత్సర్, జై సల్మేర్ పై డ్రోన్ కూడా పంపలేరు .. ఇక అణు బాంబుల దాక ఎందుకు ?
యుద్ధం ముగిసిందా ?
లేదు ..
ఇంకా ఉంది .
ప్రస్తుతానికి మనది పూర్తిగా పై చేయి .
సైనికంగా , మానసికంగా పాకిస్థాన్ దెబ్బ తింది.
కానీ మాయల ఫకీరు అంత సులభంగా లొంగడు.
శుభోదయం
by
Vasireddy Amarnath
