Site icon NTV Telugu

Operation Shield: పాకిస్తాన్ సరిహద్దులోని రాష్ట్రాల్లో నేడు మాక్ డ్రిల్.. వణుకుతున్న పాక్

Operation Shield

Operation Shield

మే 31న అంటే శనివారం పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు అధికారులు. భారత్ లో జరగనున్న ఈ మాక్ డ్రిల్ ముందు పాకిస్తాన్‌లో భయానక వాతావరణం నెలకొంది. పాకిస్తాన్‌లోని అన్ని మీడియా ఛానెళ్లలో, ఈ మాక్ డ్రిల్‌ను భారత్ కొత్త చర్యతో ముడిపెడుతున్నారు. పాకిస్తాన్ సైన్యంలోని ప్రముఖ జర్నలిస్టులు, మాజీ అధికారులు అణు దాడి భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read:GT vs MI IPL 2025 Eliminator: క్వాలిఫయర్-2కి ముంబై.. ఇంటికి గుజరాత్‌..

ఆపరేషన్ షీల్డ్‌లో భాగంగా, పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో శనివారం రాత్రి 8 గంటలకు బ్లాక్‌అవుట్‌తో పాటు మాక్ డ్రిల్ ఉంటుంది. రాత్రి ఎనిమిది గంటలకు విద్యుత్ సరఫరా నిలిపివేసి సైరన్ మోగిస్తారు. ఈ బ్లాక్అవుట్ 15 నిమిషాలు ఉంటుంది. ఆపరేషన్ షీల్డ్ ద్వారా ఈ మాక్ డ్రిల్ జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌తో పాటు హర్యానాలో నిర్వహించనున్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని కాశ్మీర్, జమ్మూ డివిజన్ జిల్లాల్లో దీని కోసం సన్నాహాలు జరిగాయి.

Also Read:JD Vance: ఎలాన్ మస్క్ శకం ముగియలేదు.. ట్రంప్‌కు సలహాలిస్తారు

మాక్ డ్రిల్స్ నిర్వహించబడే సరిహద్దు ప్రాంతాలలో, షెల్లింగ్ జరిగినప్పుడు ప్రజలను సురక్షిత ప్రదేశాలకు, ఆసుపత్రులకు ఎలా తీసుకెళ్లాలో వివరించనున్నారు. సైరన్ మోగిన వెంటనే ఇన్వర్టర్ లైట్లు, సోలార్ లైట్లు, టార్చిలైట్లు, మొబైల్ లైట్లు, వాహనాల లైట్లు ఆపివేయాలని ప్రజలందరికీ సూచించారు. మాక్ డ్రిల్ సమయంలో, ఆసుపత్రులు సహా అన్ని అత్యవసర సేవలు పూర్తిగా పనిచేస్తాయని జమ్మూ కాశ్మీర్ అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. ముందుగా మే 29న మాక్ డ్రిల్ జరగాల్సి ఉంది, కానీ అది వాయిదా పడింది.

Also Read:Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై అంతర్జాతీయ నిపుణులు ఏం తేల్చారంటే..!

హర్యానాలో మాక్ డ్రిల్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఆపరేషన్ షీల్డ్ కింద, రాష్ట్రవ్యాప్తంగా వైమానిక దాడులు, డ్రోన్ దాడులను ఎదుర్కోవడానికి సంసిద్ధతను పరీక్షించనున్నారు. అన్ని జిల్లాల్లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పౌర రక్షణ విన్యాసాలు నిర్వహిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేయడానికి పౌర రక్షణ వార్డెన్లు, రిజిస్టర్డ్ వాలంటీర్లు, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC), నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS), నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (NYKS), భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వంటి యువజన సంస్థల నుంచి 32,000 మంది వాలంటీర్లు ఇందులో పాల్గొంటారు.

Exit mobile version