NTV Telugu Site icon

Mobile Addiction: మొబైల్ ఫోన్ పక్కన పెట్టుకొని పడుకుంటే ప్రమాదమా? నిజాలు ఏమిటి?

Mobile

Mobile

Mobile Addiction: ప్రస్తుత జీవిత శైలిలో మొబైల్ ఫోన్ చాలామందికి ఆరో ప్రాణంగా మారిపోయింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన దగ్గరినుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్‌ను వదలడం లేదు. కొందరైతే పడుకునేటప్పుడు కూడా దిండు కింద లేదా పక్కన ఫోన్ పెట్టుకొని నిద్రపోతారు. అయితే, ఇలా చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రతికూలతలను ఎదురుకుంటారో చూద్దాం. చాలా మంది ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్‌పై భయపడతారు. సోషల్ మీడియాలో ఫార్వర్డ్ మెసేజ్‌లు ఈ భయాన్ని మరింత పెంచుతాయి. కానీ శాస్త్రీయంగా పరిశీలిస్తే, ఫోన్ రేడియేషన్ అంత ప్రమాదకరమని చెప్పడానికి ఆధారాలు లేవు. ఫోన్లు తక్కువ శక్తి కలిగిన రేడియేషన్‌ను విడుదల చేస్తాయి. ఇది మన జన్యువులను లేదా కణాలను ప్రభావితం చేయదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధనా సంస్థ (IARC) ప్రకారం ఇప్పటివరకు ఫోన్ రేడియేషన్‌ బ్రెయిన్ క్యాన్సర్‌కు కారణమన్న ఎలాంటి ఆధారాలు లేవు.

Read Also: Gautam Gambhir: శ్రేయస్‌ అయ్యర్‌ను తప్పించాలనుకోలేదు.. గంభీర్‌ కీలక వ్యాఖ్యలు!

మొబైల్ ఫోన్ల వాడకం వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ, వైర్‌లెస్ టెక్నాలజీ విస్తృతంగా ఉపయోగంలోకి వచ్చిన గత 20 సంవత్సరాల్లో బ్రెయిన్ క్యాన్సర్ కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపించలేదు. ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ ఎక్స్-రేలాగా శక్తివంతమైనది కాదు. దీంతో మెదడు కణాలను నేరుగా ప్రభావితం చేసే ప్రమాదం లేదు. ఇకపోతే మొబైల్స్ ను దిండు దగ్గర ఫోన్ పెట్టుకొని పడుకుంటే రేడియేషన్ కంటే నిద్రపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అది ఎలా అంటే..

Read Also: MAX : కిచ్చా సుదీప్ ‘మాక్స్’.. ఫ్యాన్స్ కోసం ఓటీటీ స్పెషల్ సర్‌ప్రైజ్‌

ఫోన్ స్క్రీన్ నుంచి వెలువడే బ్లూ లైట్ శరీరంలోని బయోలాజికల్ క్లాక్ను ప్రభావితం చేస్తుంది. నోటిఫికేషన్ సౌండ్లు, ఫోన్ వెలుతురు నిద్రను దెబ్బతీసి నిద్రలేమి, మానసిక ఒత్తిడిను పెంచుతాయి. ఇకపోతే ఫోన్ ఎక్కువసేపు వాడితే అది వేడెక్కుతుంది. దిండు కింద పెట్టితే వేడి మరింత పెరిగి మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది. కాబట్టి మొబైల్ ను దిండు కింద ఉంచి మాత్రం నిద్రపోవద్దు. ముఖ్యంగా సుఖమైన నిద్ర కోసం పడుకునే ముందు ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో ఉంచండి లేదా దూరంగా పెట్టండి. చార్జింగ్ కోసం ఫోన్‌ను మంచం దగ్గర పెట్టకండి. నిద్రకు ముందు ఫోన్ వాడకాన్ని చాలావరకు తగ్గించండి. మొత్తానికి ఫోన్ పక్కన పెట్టుకొని నిద్రపోవడం క్యాన్సర్‌కు కారణమని శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ నిద్రలేమి, మానసిక ఒత్తిడి, గుండె సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి ఫోన్‌ను దూరంగా ఉంచి, సరైన నిద్ర తీయడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.