MM Sreelekha: ఎమ్ఎమ్ శ్రీలేఖ గురించి సంగీత ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేడి మ్యూజిక్ డైరెక్టర్ గా మే ఎన్నో సినిమాలు చేసింది. అంతకు మించి కొన్ని వందల సాంగ్స్ పాడింది. కానీ, ఇప్పటివరకు తన సొంత కుటుంబం తీసిన సినిమాల్లో పాటను పాడలేదు. రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలన్నింటికి కీరవాణినే సంగీతం అందిస్తారని తెల్సిందే. ఇక అన్నలు అంత పెద్ద సినిమాలు తీసినా అందులో ఏరోజు భాగం కాలేదు ఆమె. దీంతో వీరి మధ్య విబేధాలు ఉన్నాయని, శ్రీలేఖను రాజమౌళి పక్కన పెట్టారని వార్తలు వచ్చాయి. ఇక తాజాగా శ్రీలేఖ వాటిపై స్పందించింది. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని చెప్పుకొచ్చింది.
” మా కుటుంబం మొత్తం కలిసే ఉన్నాం. మా వర్క్ విషయంలో ఎవరి నిర్ణయాలు వారివే. రాజమౌళి, కీరవాణి గారి కాంబో హిట్ అయ్యింది కాబట్టి దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. రాజమౌళి అన్నయ్యకు ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలుసు. ఒకవేళ నా వాయిస్ బావుంటుంది అనుకుంటే ఆయన నా చేత పాడించేవారు. ఒకవేళ నేను వారికి ఉపయోగపడతాను అంటే అందులో ఏమాత్రం సందేహించకుండా అవకాశం ఇస్తారు. ముందు ముందు నాకు కూడా ఆయన ఒక రోజు అవకాశం ఇస్తారేమో.. చెప్పలేము” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.