ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అందరు సభ్యులను మేడిగడ్డ పర్యటనను తీసుకు వెళ్తానని రేవంత్ రెడ్డి అన్నారు. ఎందుకు కుంగిపోయింది.. ఎందుకు పనికి రాకుండా పోయింది.. తెలుసుకుంటామన్నారు. ఈ క్రమంలో కవిత మాట్లాడుతూ.. మేడిగడ్డ అది ఏమైనా టూరిస్ట్ స్పాటా అందరినీ తీసుకు వెళ్ళడానికి అని ప్రశ్నించారు?. నిపుణుల ఆధ్వర్యంలో కమిటీ వేసి కమిటీని తీసుకు వెళ్ళండని తెలిపారు. తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కవిత అన్నారు.
Read Also: CM Revanth: అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అందరు సభ్యులను మేడిగడ్డ పర్యటనను తీసుకు వెళ్తా..
గవర్నర్ స్పీచ్ బాధాకరంగా ఉంది.. జనాలు కూడా అదే బాధతో ఉన్నారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలను నిరంకుశ ప్రభుత్వాలు అని ఎలా అంటారని ప్రశ్నించారు. మండలిలో తమకు మెజార్టీ సభ్యులు ఉన్నా.. ప్రభుత్వం యొక్క రిక్వెస్ట్ మేరకు తాను మండలి లో ఇచ్చిన అమైండ్ మెంట్ ను వెనక్కి తీసుకున్నానని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం తాము ఏమి చేస్తాము అని చెప్పాలి కానీ.. గత ప్రభుత్వ పాలన అని ఎన్ని రోజులు చెపుతారని విమర్శించారు. తెలంగాణలోని ప్రజలకు నష్టాలు జరిగితే ఎప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంటామని కవిత పేర్కొన్నారు.
Read Also: Laxman: కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది
