Site icon NTV Telugu

MLC Kavitha : మిస్టర్ కేటీఆర్ నాతో పెట్టుకోవద్దు… విరుచుకుపడ్డ కవిత..

Mlc Kavitha

Mlc Kavitha

ఎమ్మెల్సీ కవిత తాజాగా చిట్‌చాట్‌లో మాట్లాడింది. ఏది ఉన్నా తాను సూటిగానే మాట్లాడతానని స్పష్టం చేసింది. వెన్నుపోటు రాజకీయాలు చేయనని. తాను కేసీఆర్‌ లాగే నేను ఏదైనా సూటిగానే మాట్లాడతానన్నారు. తిక్క తిక్కగానే ఉంటానని తెలిపారు. “పార్టీని నడిపించే సత్తా మీకు లేదు.. నాకు నీతులు చెబుతున్నారా?. వరంగల్‌ మీటింగ్‌ సక్సెస్‌ అయ్యిందని చెప్పుకుంటున్న వాళ్లను చూసి జనం నవ్వుకుంటున్నారు. ఏమైనా ఉంటే.. పార్టీ ఫోరమ్‌ లోపల మాట్లాడాలి అన్నారు. నేను బయటే మాట్లాడతాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ సోయితో పరిపాలన జరగట్లేదు అని అన్నారు. నాకు వెన్నుపోటు రాజకీయాలు తెలియదు.. ఏది ఉన్నా నేను ముక్కు సూటిగానే మాట్లాడతాను.” అని కవిత వ్యాఖ్యానించారు.

READ MORE: Ananthapuram: మారువేషంలో అనంతపురం జిల్లా కలెక్టర్.. గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో తనిఖీలు

అంతర్గత విషయాలపై లేఖ రాస్తే ఎందుకు బయటపెట్టారని కవిత ప్రశ్నించారు. తాను రాసిన లేఖను ఎవరు బయటపెట్టారు? అని నిలదీశారు. బీఆర్‌ఎస్‌లో నాకు ఒకే నాయకుడు కేసీఆర్‌.. నాకు ఇంకెవరూ నాయకులు లేరని స్పష్టం చేశారు. పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని తాను అంగీరించనని కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. “వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా చేయాల్సిన పనులు చేయాలని.. కేవలం ట్వీట్లకే పరిమితం అయితే ఎలా?. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఆయన చేసే కార్యచరణ చేయనివ్వండి. నాది బీఆర్‌ఎస్‌ పార్టీనే. కొత్త పార్టీలు ఎందుకు?. ఉన్న పార్టీని, కేసీఆర్‌ను కాపాడుకుంటే సరిపోతుంది. నేను కాంగ్రెస్‌తో 2013లోనే మాట్లాడాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడలేదు. కాంగ్రెస్‌ మునిగిపోయే నావ అని సెటైర్లు వేశారు. బీజేపీ వాళ్లు కట్టిన ఆసుపత్రి ఓపెనింగ్‌కి వెళ్ళిన వాళ్ళు బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నారని అన్నారు.” అని కవిత వ్యాఖ్యానించారు.

READ MORE: Bayya Sunny Yadav: ఎన్‌ఐఏ అదుపులో భయ్యా సన్నీ యాదవ్.. పాక్ టూర్‌పై ఆరా

 

Exit mobile version