Site icon NTV Telugu

MLC Kavitha : ఢిల్లీకి వెళ్లిన కవిత.. నేడు రౌండ్‌ టేబుల్‌ సమావేశం

Kavitha

Kavitha

పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మరియు ఇతరులతో బీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం న్యూఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. నేడు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు దేశ రాజధానిలోని ఓ హోటల్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు కవిత కార్యాలయం తెలిపింది. కవిత నేతృత్వంలోని సాంస్కృతిక సంస్థ భారత్ జాగృతి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు ఉదయం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి కవిత బయలు దేరారు. అయితే.. మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం పెట్టాలని డిమాండ్ చేస్తూ ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రతిపక్షాలతో కవిత ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నారు.

Also Read : Russia Ukraine War: రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలోకి అమెరికా ప్రవేశం?

అన్ని పార్టీలను కవిత ఏకతాటిపైకి తెస్తున్నారని, అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచవచ్చని అంటున్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో దేశంలోని మహిళల సమస్యలపై కూడా చర్చించనున్నారు. ఇదిలా ఉంటే.. రేపు మరోసారి ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందు హాజరుకానున్నారు. ఈ నెల 11న కూడా ఆమె ఈడీ ముందు హాజరయ్యారు. ఆమెను తొమ్మిది గంటల పాటు ఈడీ విచారించింది. అయితే.. రేపు ఈడీ విచారణలో ఏం జరుగుతుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Also Read : 56Blades in Stomach : చావాలని 56షేవింగ్ బ్లేడ్లను మింగాడు.. కానీ

Exit mobile version