Site icon NTV Telugu

MLC Kavitha : పోలవరం ముంపు సమస్యలపై తెలంగాణ జాగృతి రౌండ్‌టేబుల్

Kavitha

Kavitha

MLC Kavitha : పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితుల సమస్యలపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భద్రాచలం సమీపంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ముంపు గ్రామాల ప్రజలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముంపు గ్రామాల ప్రజలు తమకు ఎదురవుతున్న విద్య, వైద్యం, రవాణా వంటి సమస్యలను ప్రస్తావించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రం నాటి నుంచే తెలంగాణ జాగృతి వ్యతిరేకిస్తూ వస్తోందని, కోర్టుల్లో పలు పిటిషన్లు వేశామని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 136 గ్రామాలకే ముంపు అవకాశం ఉందని స్పష్టంగా ఉన్నా, 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఏడు మండలాలు ఏపీలో కలిపేలా చర్యలు తీసుకున్నారని విమర్శించారు.

Marriage: కొడుకుతో నిశ్చితార్థం.. కాబోయే కోడలిని పెళ్లి చేసుకున్న మామ.. అసలు ఏం జరిగిందంటే?

చంద్రబాబు నాయుడు కేంద్రంలో ‘బ్యాక్‌డోర్ పాలిటిక్స్’ ద్వారా ఈ మండలాలను ఆంధ్రాలో కలిపారని, తాము అప్పట్లో ఎంపీలుగా పార్లమెంటులో గట్టిగా పోరాటం చేశామని ఆమె గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ కూడా అప్పట్లో మండలాల విలీనానికి వ్యతిరేకంగా తెలంగాణ బంద్‌కు పిలుపిచ్చారని తెలిపారు.

కవిత వ్యాఖ్యానించడానికి ముఖ్యమైన అంశం.. భద్రాచలం రామాలయానికి ముంపు భయాందోళన. భద్రాచలం నుంచి దమ్ముగూడెం వరకు గోదావరి కరకట్టలను నిర్మించాలంటే, ప్రస్తుతం ఏపీలో ఉన్న యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం, పిచ్చుకలపాడు గ్రామ పంచాయతీలు తెలంగాణలో కలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ గ్రామాల్లో ప్రజలు ప్రాథమిక హక్కులు కోల్పోతున్నారని, విద్యా, వైద్య సదుపాయాల కొరత తీవ్రంగా ఉందన్నారు.

అయన భద్రాచలంలో ఉన్న రామాలయ భూములను ఆక్రమించకుండా చూసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. పోలవరం ముంపు ప్రభావిత ప్రాంతాలపై జాయింట్ సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. జులై 25న ప్రధాని మోడీ అధ్యక్షతన జరగనున్న ప్రగతి ఎజెండా సమావేశంలో ఈ సమస్యలను నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశం ద్వారా ముంపు బాధితుల కష్టాలు మళ్లీ ఒకసారి జాతీయ దృష్టికి రావడం, పరిష్కారాలకు మరింత వేగం రావాలని ఆశిస్తున్నట్లు తెలంగాణ జాగృతి సభ్యులు తెలిపారు.

VIVO Y400 Pro 5G: 6.77 అంగుళాల కర్వుడ్ స్క్రీన్‌, 5500mAh భారీ బ్యాటరీ లాంటి ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్లతో వచ్చేసిన వివో Y400 ప్రో..!

Exit mobile version