NTV Telugu Site icon

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్‌ షాక్‌.. జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: జ్యుడీషియల్‌ కస్టడీ పూర్తి కానుండటంతో మంగళవారం ఉదయం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను తీహార్‌ జైలు అధికారులు జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కవితను జైలు అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. కవితకు జ్యుడీషియల్ రిమాండ్‌ను ఈ నెల 23 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఈడీ అధికారులు తీహార్‌ జైలుకు తరలించనున్నారు. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని ఈడీ కోరింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని, కవిత జ్యుడీషియల్ కస్టడీ 14 రోజులు పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది. కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించడానికి ఈడీ వద్ద కొత్తగా ఏమి లేవని కవిత తరపు న్యాయవాది రానా పేర్కొన్నారు. 2022 నుంచి కేసు దర్యాప్తు సాగుతుందని, కవిత ప్రభావితం చేసే వ్యక్తి అని మొదటి నుంచి కానీ అలాంటిది ఏమి లేదన్నారు రానా.

Read Also: MLC Kavitha: కవిత జ్యుడీషియల్ రిమాండ్‌పై తీర్పు రిజర్వ్

కవితను మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోరగా.. కవిత కోర్టులో నేరుగా మాట్లాడేందుకు అనుమతి నిరాకరించారు న్యాయమూర్తి కావేరి బవేజా. నేరుగా నిందితురాలు మాట్లాడేందుకు హక్కు కలిగి ఉంటారని కవిత తరపు న్యాయవాది తెలిపారు. అప్లికేషన్ వేసుకోవాలని జడ్జి కావేరి బవేజా సూచించారు. కవితను కోర్టులో భర్త, మామ కలిసేందుకి కవిత న్యాయవాదులు అప్లికేషన్ ఇచ్చారు. కోర్టులో కవితను కలిసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.