NTV Telugu Site icon

MLC Kavitha: రాష్ట్రంలో పింక్ వేవ్ తప్ప మరో వేవ్ లేనే లేదు..

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: రాష్ట్రంలో పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. పలు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. రాష్ట్రంలో పింక్ వేవ్ తప్ప మరో వేవ్ లేనే లేదని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ జోష్ గాంధీ భవన్‌లో తప్ప రాష్ట్రంలో లేనే లేదని ఆమె అన్నారు. బీసీలకు ఒక్క సీటు ఇవ్వని కాంగ్రెస్.. బీసీ డిక్లరేషన్ ప్రకటించడం హాస్యాస్పదమంటూ ఎద్దేవా చేశారు. ఫెయిల్యూర్ స్టేట్ ఫెయిల్యూర్ సీఎంను తీసుకొచ్చి ఇక్కడ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని ఆమె ఆరోపించారు. క్రెడిబులిటీ లేని పార్టీలు, నాయకులు మాత్రమే డిక్లరేషన్‌లు చేస్తాయన్నారు. తప్పుడు సర్వేలతో సోషల్ మీడియాలో ప్రచారం చేసినంత మాత్రానా అధికారంలోకి రారని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు.

Also Read: Minister KTR: తెలంగాణ ఏర్పాటు ముందు ఎన్నో అనుమానాలు ఉండేవి..

తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దిన ప్రజాదరణ కలిగిన సీఎం కేసీఆర్‌ను విమర్శించే హక్కు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కర్ణాటకలో మాదిరిగా కాకుండా ఇచ్చిన హామీలను అమలు చేసిన చరిత్ర సీఎం కేసీఆర్‌దని.. మేనిఫెస్టోలో చేర్చని హామీలను సైతం అమలు చేసి చూపించారని అన్నారు. గొప్ప రాష్ట్రమైన కర్నాటకలో నాయకత్వ సంక్షోభం ఏర్పడిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ వంటి రాష్ట్రాలకు వచ్చే ముందు ఇక్కడి స్థితిగతులన్నింటినీ తెలుసుకొని రావాలని సిద్ధరామయ్యకు హితవు పలికారు. గతంలో కాంగ్రెస్ భయానక పాలనను ప్రజలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని కోరారు కవిత. ఇచ్చిన హామీలను అమలు చేయలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటే అక్కడి సీఎం సిద్ధరామయ్య మన రాష్ట్రానికి వచ్చి బీసీలకు ఏం చేయాలో మన సీఎం కేసీఆర్‌కు పాఠాలు చెబుతున్నారని మండిపడ్డారు.