దళితుల పై కాంగ్రెస్ పార్టీ ఎక్కడి లేని ప్రేమ చూపిస్తు దళిత డిక్లరేషన్ ప్రకటించిందని మండిపడ్డారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రకటించిన దళిత డిక్లరేషన్ కాదు, ఫాల్స్ డిక్లరేషన్ అని ఆమె ధ్వజమెత్తారు. దళిత డిక్లరేషన్ అబద్దపు డిక్లరేషన్ అని, రెండు పార్టీలు రైతుల పేరుతో రాజకీయాలు చేస్తున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లికార్జున ఖర్గే దళితుల పట్ల చేసిన ప్రకటన రాజకీయం తప్ప ఏం లేదని, కర్నాటకలో ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలు ఇచ్చి వాగ్దానాలు నెరవేర్చడం లేదన్నారు.
Also Read : France: ఫ్రాన్స్ సంచలన నిర్ణయం.. స్కూళ్లలో ముస్లిం “అబయా దుస్తుల”పై నిషేధం..
అమిత్ షా ఖమ్మంలో రైతుల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఆమె విమర్శించారు. హంతకులు వచ్చి నివాళులర్పించిన పరిస్థితి బీజేపీ పార్టీది అని, బీజేపీ ప్రభుత్వం మోటార్లు, మీటర్లు అంటున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ 115 స్థానాలు ప్రకటిస్తే, కాంగ్రెస్ , బీజేపీ పార్టీలో అభ్యర్థుల ప్రకటన ఇప్పటి వరకు జరగలేదని, వ్యూహంలో భాగంగా కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. రైతుల కోసం బీజేపీ మీటింగ్ పెట్టడం, ఆ సభకు అమిత్ షా రావడం, హంతకుడే రైతులకు సంతాపం తెలిపినట్టుందని మండిపడ్డారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని బీజేపీ ప్రభుత్వం చూస్తున్నదని ఆరోపించారు. దళితుల కోసం పనిచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. అదే కర్ణాటక రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని కుంటి సాకుగా చెప్తూ ఉచిత పథకాలను ఎత్తి వేసిందని విమర్శించారు.
Also Read : France: ఫ్రాన్స్ సంచలన నిర్ణయం.. స్కూళ్లలో ముస్లిం “అబయా దుస్తుల”పై నిషేధం..