Site icon NTV Telugu

MLC Kavitha : జగిత్యాల నుండే టీఆర్‌ఎస్‌ జైత్ర యాత్ర మొదలవుతుంది

Mlc Kavitha

Mlc Kavitha

జగిత్యాల జిల్లాలోనే నేడు సీఎం కేసీఆర్‌ పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తారు. అయితే.. ఈ సభలో పాల్గొనేందుకు ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు జగిత్యాలకు చేరుకుంటున్నారు. అయితే.. తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం జగిత్యాలకు బయలు దేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జగిత్యాల నుండే టీఆర్ ఎస్ జైత్ర యాత్ర మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ సభకు హాజరు అయేందుకు వెళ్తున్నానని, జగిత్యాలలో మెడికల్ కాలేజీ ఏర్పాటు, కొత్తగా ఏర్పడ్డ జిల్లాలో వంద కోట్లతో వసతులు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
Also Read : Digital Payments : వాడకం అంటే ఇది.. డిజిటల్‌ పేమెంట్సా మజాకా..!

జగిత్యాలలో అద్భుత అభివృద్ధి సాధించుకున్నామన్న కవిత.. సాగునీటి రంగంలో వృద్ధి సాధించామన్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఢిల్లీ లిక్కర్‌ స్కాం రిమాండ్‌ రిపోర్ట్‌లో ఎమ్మెల్సీ కవితి పేరు ఉండటం హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసులో ఆమె విట్నెస్‌గా ఉండటంతో.. ఆమెను విచారించేందుకు సీబీఐ నోటీసులు పంపింది. ఈ క్రమంలోనే కవిత తను అందుబాటులో ఉండే పలు తేదీలను సూచిస్తూ లేఖ పంపడంతో.. సీబీఐ అధికారులు ఈ నెల 11న వచ్చి విచారిస్తామని రిప్లై ఇచ్చారు.

Exit mobile version