NTV Telugu Site icon

MLC Kavita : ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా విశ్వాసం కోల్పోని వ్యక్తి కేసీఆర్‌

Kavitha Mlc

Kavitha Mlc

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మళ్లీ జగిత్యాల నుండే జైత్రయాత్ర షురూ చేస్తామన్నారు. జీవన్ రెడ్డి జగిత్యాలలో గ్రామాల అభివృద్దిని నిర్లక్ష్యం చేశారని ఆమె విమర్శించారు. బీడీ కార్మికుల ఓటు అడిగారు కానీ పెన్షన్ ఎవరు ఇవ్వలేదని ఆమె వ్యాఖ్యానించారు. కానీ కేసీఆర్ బీడీ కార్మికుల‌కు పెన్ష‌న్లు ఇస్తున్నారన్న కవిత.. ఒక్క రాయిక‌ల్ మండ‌లంలోనే 16700 మంది ల‌బ్ధిదారుల‌కు పెన్ష‌న్లు అందిస్తున్నామన్నారు. ఉత్త చేతులతో మోడీ రావడం తప్ప తెలంగాణకు చేసింది ఏం లేదని ఆమె మండిపడ్డారు. బీజేపీవి అన్ని అబద్ధపు అసత్యపు ప్రచారాలు ఆమె ధ్వజమెత్తారు.
Also Read : Twitter Blue tick : వెనక్కి తగ్గిన ఎలాన్‌ మస్క్‌..! ట్విట్టర్‌ బ్లూ టిక్‌పై యూటర్న్‌..!

కేసీఆర్‌ మొహం చాటేయ్యలేదని మీ రాహుల్ గాంధీ జోడీ యాత్ర పేరుతో మునుగోడులో మొహం చాటేశారన్నారు. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా విశ్వాసం కోల్పోని వ్యక్తి కేసీఆర్‌ అని ఆమె వ్యాఖ్యానించారు. ఒట్టి మాటలు చెప్పేవాళ్లు ఎవరో.. అభివృద్ది చేసేవాళ్లు ఎవరో ప్రజలు తెలుసుకోవాలని ప్రజలను కోరారు. మొహం చాటేసే పార్టీలు ఏవో ప్రజలు గుర్తించాలని కోరారు ఎమ్మెల్సీ కవిత. మ‌న నాయ‌కుడు కేసీఆర్ అన్ని వ‌ర్గాల గురించి ఆలోచిస్తున్నారని ఆమె అన్నారు. చేసిన ప‌నిని చెప్పాలి. చేయాల్సిన ప‌నిని బాధ్య‌త‌తో చేయించాల‌ని కార్య‌క‌ర్త‌ల‌కు క‌విత సూచించారు.