NTV Telugu Site icon

MLC Jeevan Reddy : తెలంగాణ రాష్ట్రంలో నంబర్ వన్ 420 కేసీఆర్ ..

Jeevan Reddy

Jeevan Reddy

తెలంగాణ రాష్ట్రంలో నంబర్ వన్ 420 కేసీఆర్ అని ఆరోపించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ మోసగాడు అని అందరు మోసగాళ్లు అనుకుంటే ఏట్లా కేటీఆర్‌ అని జీవన్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. నెల రోజులోనే హామీలని అమలు చేయలేదని కాంగ్రెస్ 420 అని కేటీఆర్ అనడం ఆశ్చర్యంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్‌ మొదటగా దళితులని మోసం చేసారని ఆయన వ్యాఖ్యానించారు. దళితులకు మూడు ఎకరాల భూమి అని మరోసారి మోసం చేసారని, మీరు ఇచ్చిన హమీలని ఒకసారి నెమరవేసుకోండి కేటీఆర్‌ అని జీవన్‌ రెడ్డి చురకలు అంటించారు. 9 సంవత్సరాల్లో నగరంలో తప్ప ఎక్కడైన ఇళ్ళు కట్టారా ..? అని ఆయన ప్రశ్నించారు. మేము అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మహిళకు ఉచిత బస్ ప్రయాణం కలిపించామని ఆయన వెల్లడించారు. మేము ఇచ్చిన హమీలని నెరవేర్చడానికి మూడు వారాలనే దరఖాస్తులు తీసుకుంటున్నామని, గిరజనులని, దళితులని మోసం చేసింది బీఆర్ఎస్ అని జీవన్‌ రెడ్డి మండిపడ్డారు.

అంతేకాకుండా.. ‘బీఆర్ఎస్ పెట్టి తెలంగాణ పదాన్ని ఉచ్చరించే నైతిక హక్కు కెసిఆర్ కోల్పోయారు.. కేసీఆర్ సీఎం అయిన మొదటి నెలలో సీలేరు పవర్ ప్రాజెక్టు ,భద్రాద్రి ఏడు మండలాలని ఆంధ్రప్రదేశ్‌కి అప్పచెప్పారు.. కాంగ్రెస్ ప్రజలకి ఇచ్చిన హమీలని నెరవేర్చి తీరుతుంది.. తెలంగాణ హక్కులని పరిరక్షించేది కాంగ్రెస్.. కేసీఆర్ అవినితి బయటపడుతుంది అని కాళేశ్వరం ప్రాజెక్ట్ కి జాతీయ హొదా అడగలేదు.. ప్రతిపక్ష హోదాని కాపాడుకోండి.. అది తన్నుకుపోవడానికి మీ పక్కన సిద్దంగా ఉన్నారు.. జ్యుడీషియల్, సీబీఐ ఏదీ పెద్దది కిషన్‌ రెడ్డి.. కవితని కాపాడినట్లు కాపాడాలని చూస్తున్నారు.. మేము 15 పార్లమెంట్ స్థానాలని కైవసం చేసుకోవడం లక్ష్యంగా ముందుకి వెళుతున్నాం.. కిషన్‌ రెడ్డి ముందు మీ స్థానం కాపాడుకోండి.. షర్మిల చేరిక కాంగ్రెస్ కలసి వస్తుంది.. జగన్, కేసీఆర్ భేటీలో రాజకీయం ఉంటుంది.. కాంగ్రెస్ లో షర్మిల చేరిక ఎంత ప్రభావం ఉంటుందో జగన్, కేసీఆర్ చర్చించుకోవచ్చు..’ అని జీవన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.