తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తానని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కానీ వీఆర్ఏలను వేరే శాఖలకు బదిలీ చేయడం ఉద్యోగస్తులను మోసగించడమేనని ఆయన విమర్శించారు. వేరే శాఖకు బదిలీ చేయడం వల్ల కొందరు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉందని, వేరే శాఖ బదిలీ వల్ల ఇప్పుడున్న వీఆర్ఏల విద్యార్హత సరిపోక కొందరికి అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు జీవన్ రెడ్డి. వారసత్వం ద్వారా వచ్చిన వీఆర్ఏలకు కనీస విద్యార్హత లేక అన్యాయం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Manchu Vishnu: స్టార్ కమెడియన్ ఇంట్లో నోట్ల కట్టలు.. గుట్టు బయటపెట్టిన మా ప్రెసిడెంట్
రెవెన్యూ శాఖలో ఉద్యోగాలను కోత పెట్టి రెవెన్యూ శాఖను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆయన మండిపడ్డారు. రెవెన్యూ శాఖలో వీఆర్ఏల కొరతతో ధరణిలో సమస్యలు పేరుకుపోయాయని ఆయన అన్నారు. గ్రామాల వారిగా మండల వారీగా రెవెన్యూ శాఖలో సిబ్బంది కొరతతో ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర సాధనలో నీళ్లు నిధులు నియామకాలని చెప్పిన ప్రభుత్వం.. నీళ్లు అని చెప్పి కమీషన్లతో ప్రాజెక్టులను నియామకాలలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయకుండా కుదించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన వెల్లడించారు.
Also Read : Adipurush: జగతికే ధర్మ దీపం.. నిండైన నీ విగ్రహం.. జై శ్రీరామ్.. జై శ్రీరామ్