Site icon NTV Telugu

Andhra Pradesh: ఎల్లుండి ఎమ్మెల్సీ ఎన్నికలు.. భారీగా భద్రతా ఏర్పాట్లు

Ap Mlc

Ap Mlc

ఏపీలో గురువారం మూడు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ పోలింగ్‌తో పాటు ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అందుకోసం.. అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో మొత్తం 6,62,100 మంది ఓటర్లు ఉన్నారు. కాగా.. రెండు నియోజకవర్గాల్లో 60 మంది అభ్యర్ధులు పోటీలో నిలిచారు. మొత్తం 939 పోలింగ్ కేంద్రాల్లో పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలు జరుగనున్నాయి.

Read Also: Kerala: వెంజరమూడి హత్య కేసులో వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు.. కారణాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 10 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గానికి 22,493 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీనికోసం ఉత్తరాంధ్ర జిల్లాల్లో 123 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన మొత్తం 17 జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలు విస్తరించాయి. పోలింగ్ కోసం 8500 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.

Read Also: V.Hanumantha Rao: ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేత..

Exit mobile version