Site icon NTV Telugu

MLC Kuchakulla: కాంగ్రెస్ లోకి ఎమ్మెల్సీ కూచుకుళ్లు దామోదర్ రెడ్డి..

Kuchukulla Damodar Reddy

Kuchukulla Damodar Reddy

బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి ప్రకటించారు. విలువలు లేని చోట తాను ఉండలేనని ఆయన పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రియాంకగాంధీ త్వరలోనే నాగర్ కర్నూలులో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ తీర్థం తీసుకోనున్నట్లు దామోదర్ రెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్ ద్వారా దక్కిన ఎమ్మెల్సీ పదవికి కూడ ఆయన రాజీనామా చేయనున్నారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తీరుపై ఇప్పటికే కూచుకుళ్ల అసంతృప్తితో ఉన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మర్రి జనార్ధన్ రెడ్డి సహకరించలేదని దామోదర్ రెడ్డి ఆరోపించారు. అప్పటి నుండి దామోదర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి మధ్య గ్యాస్ కొనసాగుతుంది. గత నెల 10న కాంగ్రెస్ నేత మల్లు రవితో కూచుకుళ్ల దామోదర్ రెడ్డి సమావేశమయ్యారు.

Read Also: Narne Nithin: ఎన్టీఆర్ బామ్మర్దికి బంపరాఫార్.. తంతే గీతా బుట్టలో పడ్డాడుగా!

అయితే.. ఈ మీటింగ్ కు ముందే నియోజకవర్గ వ్యాప్తంగా తన అనుచరులుతో కూచకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు సమావేశాలు నిర్వహించారు. పార్టీని వీడే విషయంపై అనుచరులతో చర్చించారు. అయితే జూన్ నెలలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి హాజరుకాలేదు. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ నెలలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే ఛాన్స్ ఉంది. జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే ఛాన్స్ ఉంది.

Read Also: Viral Video: పామును తిన్న తాబేలు.. నమ్మలేకపోతున్నారా ఈ వీడియో చూడండి..!

బీఆర్ఎస్ లో చేరడానికి ముందు ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్య ఆయన హస్తం పార్టీని వీడి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుంచి తనయుడు రాకేష్ ను బరిలోకి దింపాలని కూచుకుళ్ల భావిస్తున్నారు. ఈ విషయమై దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే గతంలో దామోదర్ రెడ్డికి ప్రత్యర్ధిగా ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి కూడ ప్రెసెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నాగర్ కర్నూల్ నుండి పలుసార్లు నాగం టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. అయితే ఈసారి నాగం జనార్థన్ రెడ్డి కూడా నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Exit mobile version