Botsa Satyanarayana: ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్..

  • వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్
  • అర్ధరాత్రి హైదరాబాద్‌కు తరలింపు
  • సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స
  • నిలకడగా బొత్స సత్యనారాయణ ఆరోగ్యం
Botsa Satyanarayana

Botsa Satyanarayana

వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బొత్స బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడ్డారు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు. బొత్స సత్యనారాయణను హైదరాబాద్‌కు తరలించారు. నిన్న రాత్రి సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరిన బొత్స సత్యనారాయణ.. సిటీ న్యూరో సెంటర్ హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉందటున్నారు వైద్యులు. బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ప్రమాదమేమీ లేదని డాక్టర్లు తెలిపారు. బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందన్న విషయం తెలియగానే కార్యకర్తలు, వైసీపీ లీడర్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బొత్స త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.