NTV Telugu Site icon

MLC Botsa Satyanarayana: అందుకే ఏపీలో లులు మాల్‌ వద్దన్నాం..

Botsa Satyanarayana

Botsa Satyanarayana

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటైపోయి స్టీల్ ప్లాంట్ లో 4వేల మంది కార్మికులను తొలగించటానికి సిద్ధం అవుతున్నాయని ఎమ్మెల్సీ బోత్స సత్యనారాయణ అన్నారు. ఏ ఒక్కరినీ తొలగించటానికి అడుగులు వెయ్యొద్దని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో గెలిపిస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారని… అవి ఇస్తారో చేస్తారో తెలియదు గానీ ఈ 4 వేల మంది ఉద్యోగాలు తొలగించవద్దని కోరారు. వాలంటీర్లకు 10వేలు ఇస్తారాన్నారు.. కానీ వాళ్ళ ఉద్యోగాలకు హామేనే లేదన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేస్తుందని ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వ పెద్దలని హెచ్చరించారు. మందు ధరలు తగ్గించామని సంబర పడిపోతున్నారని..నిత్యావసర కూరగాయలు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. గత ప్రభుత్వంలో సుమారు రెండు కోట్లు పెట్టి మార్కెట్ రెన్యూ వేషన్స్ చేశామని చెప్పారు.

READ MORE: Nadendla Manohar: రేషన్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే నిత్యవసర సరకులు

మిమ్మల్ని ఎన్నుకున్న పుణ్యానికి ధరలు పెంచేశారని.. పేదవాడి 5 వేళ్ళు లోపలికి వెళ్ళడానికి కష్టంగా మారిందని ఎమ్మెల్యీ బొత్స ఆరోపించారు. “లులు కంపెనీలు మళ్ళీ వైజాగ్ కి వస్తున్నాయని హడావిడి చేస్తున్నారు.. ఆర్కే బీచ్ రోడ్డులో 1300 కోట్లు విలువ చేసే భూముల్లో 6 వందల కోట్లు పెట్టుబడి పెడతామన్నారు. అందుకే ఆలోచించాల్సి వచ్చి వద్దన్నాం. ప్రత్యామ్నాయంగా ఇనార్బిట్ మాల్ తీసుకొచ్చాం. ఎన్నో మంచి పనులు చేశాం. ఎక్కడో చిన్న చిన్న తప్పులకు ప్రజలు మీకు ప్రభుత్వం అప్పగించారు. ఎన్నో హామీలు ఇచ్చారు నెరవేర్చండి.” అని వ్యాఖ్యానించారు.

READ MORE: Israel-Hezbollah: లెబనాన్‌ను ఖాళీ చేసి వెళ్లిపోండి.. ఇజ్రాయెల్ హెచ్చరిక

Show comments