Botsa Satyanarayana: ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతం.. విశాఖ ఒకేలా అభివృద్ధి చెందాలన్నారు. ప్రస్తుతానికి మా పార్టీది మూడు రాజధానుల విధానమేనని.. మూడు రాజధానులపై మా పార్టీ విధానం మార్చాలనుకుంటే మా నాయకుడితో చర్చించుకుంటామని స్పష్టం చేశారు. ఒకవేళ విధానం మారితే చెబుతామని ఆయన వెల్లడించారు.
Read Also: Botsa Satyanarayana: ఎమ్మెల్సీగా బొత్స ప్రమాణం.. అభినందించిన జగన్
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా తనను ఎన్నుకున్నారన్న బొత్స.. స్థానిక నేతలు, వైసీపీ నేతలకు అన్నిటి కంటే ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బాధ్యతగా పదవిని నిర్వహిస్తానని పేర్కొన్నారు. జగన్ అసెంబ్లీకి వచ్చారా..? లేదా అనేది కాదు ప్రజలకు మేలు జరిగేలా చూడడమే ముఖ్యమన్నారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసిందని.. ప్రస్తుతానికి కేవలం 75 రోజులు మాత్రమే పూర్తి అయిందన్నారు. ఏపీలో జరుగుతున్న అరాచకాలపైనే ఢిల్లీలో పోరాడామని ఆయన వెల్లడించారు.
