NTV Telugu Site icon

Maharastra: బైక్ను ఢీకొట్టిన ఎమ్మెల్యే మేనల్లుడు.. బైకిస్ట్ మృతి

Maharastra Road Accident

Maharastra Road Accident

శనివారం పూణె-నాసిక్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర ఎమ్మెల్యే మేనల్లుడు ప్రయాణిస్తున్న కారు రాత్రి ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 19 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మయూర్ మోహితను అరెస్ట్ చేశారు. పూణే జిల్లాలోని ఖేడ్ అలండి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే దిలీప్ మోహితే పాటిల్ మేనల్లుడు మయూర్. దిలీప్ మోహితే పాటిల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే. కాగా.. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి ఓం భలేరావుగా గుర్తించారు.

Read Also: America: అమెరికాలో దుండగుడు కాల్పులు.. ఏపీ యువకుడు మృతి

నిందితుడు మయూర్ మోహితే నడుపుతున్న టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ రాంగ్ రూట్లో వచ్చి బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే దిలీప్ మోహితే మీడియాతో మాట్లాడుతూ.. తన మేనల్లుడు సంఘటన స్థలం నుండి పారిపోలేదని చెప్పారు. అంతేకాకుండా..తాను మద్యం తాగి డ్రైవిండ్ చేయలేదన్నారు. ఈ ప్రమాదం అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్లే జరిగిందని తెలుస్తోంది. గత నెలలో నిర్లక్షపు డ్రైవింగ్తో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు మరణించారు. వేగంగా వచ్చిన పోర్షే వాహనం.. వారి బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. కారును నడిపింది రియల్ ఎస్టేట్ ఏజెంట్ 17 ఏళ్ల కుమారుడు.

Read Also: Diarrhea Cases: కాకినాడ జిల్లాలో డయేరియా కలకలం.. ఇప్పటివరకు ఇద్దరు మృతి

మద్యం తాగి వాహనం నడిపిన నిందితుడు.. ప్రమాదం జరిగిన 15 గంటల్లోనే బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో పోలీసులు తమ విచారణను వేగవంతం చేశారు. ఆ తర్వాత ఈ ఘటనలో అనేక విషయాలు బయటపడ్డాయి. ఈ ప్రమాదంలో పోలీసులు చాలా మందిని అరెస్టు చేశారు.