Maharastra: బైక్ను ఢీకొట్టిన ఎమ్మెల్యే మేనల్లుడు.. బైకిస్ట్ మృతి
- శనివారం పూణె-నాసిక్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
- బైక్ను ఢీకొట్టిన ఎమ్మెల్యే మేనల్లుడు.. బైకిస్ట్ మృతి
- నిందితుడు మయూర్ మోహిత అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శనివారం పూణె-నాసిక్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర ఎమ్మెల్యే మేనల్లుడు ప్రయాణిస్తున్న కారు రాత్రి ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 19 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మయూర్ మోహితను అరెస్ట్ చేశారు. పూణే జిల్లాలోని ఖేడ్ అలండి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే దిలీప్ మోహితే పాటిల్ మేనల్లుడు మయూర్. దిలీప్ మోహితే పాటిల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే. కాగా.. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి ఓం భలేరావుగా గుర్తించారు.
Read Also: America: అమెరికాలో దుండగుడు కాల్పులు.. ఏపీ యువకుడు మృతి
Also Read
నిందితుడు మయూర్ మోహితే నడుపుతున్న టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ రాంగ్ రూట్లో వచ్చి బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే దిలీప్ మోహితే మీడియాతో మాట్లాడుతూ.. తన మేనల్లుడు సంఘటన స్థలం నుండి పారిపోలేదని చెప్పారు. అంతేకాకుండా..తాను మద్యం తాగి డ్రైవిండ్ చేయలేదన్నారు. ఈ ప్రమాదం అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్లే జరిగిందని తెలుస్తోంది. గత నెలలో నిర్లక్షపు డ్రైవింగ్తో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు మరణించారు. వేగంగా వచ్చిన పోర్షే వాహనం.. వారి బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. కారును నడిపింది రియల్ ఎస్టేట్ ఏజెంట్ 17 ఏళ్ల కుమారుడు.
Read Also: Diarrhea Cases: కాకినాడ జిల్లాలో డయేరియా కలకలం.. ఇప్పటివరకు ఇద్దరు మృతి
మద్యం తాగి వాహనం నడిపిన నిందితుడు.. ప్రమాదం జరిగిన 15 గంటల్లోనే బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో పోలీసులు తమ విచారణను వేగవంతం చేశారు. ఆ తర్వాత ఈ ఘటనలో అనేక విషయాలు బయటపడ్డాయి. ఈ ప్రమాదంలో పోలీసులు చాలా మందిని అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు