హన్మకొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో 8న వరంగల్‌లో ప్రధాని పర్యటన పైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, అరూరి రమేష్, నన్నపనేని నరేందద్, తాటికొండ రాజయ్య లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడారని ఆయన అన్నారు. అంకెల గారేడీ చేసి మాట్లాడారని, అనేక సంవత్సరాల క్రితం నుంచే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఉద్యమం పార్టీలకు అతీతంగా జరుగుతుందన్నారు. ఇందిరాగాంధీ హామీ ఇచ్చిన నెరవేర్చలేదని, ఇక్కడ నెలకొల్పే కోచ్ ఫ్యాక్టరీ నీ పంజాబ్ తీసుకు వెళ్ళారన్నారు. అంతేకాకుండా.. ‘ఇది కాంగ్రెస్ పార్టీ వరంగల్ కు చేసిన ద్రోహం. కేంద్రం ముందు ఉద్యమ నేత కెసిఆర్ రాష్ట్ర విభజన సమయంలో ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టారు. వరంగల్ లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, బయ్యారం లో ఉక్కు పరిశ్రమ, ములుగు లో గిరిజన యునివర్సిటీ ఏర్పాటు అంశాలు అవి విబజన చట్టంగా మారాయి.
Also Read : Rape: ఢిల్లీలో దారుణం.. కూల్ డ్రింక్లో మత్తు మందు ఇచ్చి అత్యాచారం..!
కేంద్ర ప్రభుత్వం విబజన చట్టం చేస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం హామీలు విస్మరించారు. రాజకీయం చేస్తూ గ్రూపు రాజకీయాలు మాపుకోవాలని బీజేపీ నాయకులు రాజకీయాలు మొదలు పెట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మళ్ళీ ప్రజలను మోసం చేసే కుట్ర చేస్తున్న బీజేపీ. రైల్ వ్యాగన్ ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం స్వాగతిస్తున్నాం. బీఆర్‌ఎస్ ఒత్తిడి పలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు. కోచ్ ఫ్యాక్టరీ సాధించే వరకు ఉద్యమం చేస్తాం. బీజేపీ నేతలకు, కేంద్ర మంత్రి చిత్త శుద్ది ఉంటే ఈ నెల 8 న కేంద్ర ప్రధాన మంత్రితో కోచ్ ఫ్యాక్టరీ ప్రకటన చేయించాలి. విభజన చట్టం లో పొందు పరిచిన హామీలు అమలు చేయడంతో పాటు జాతీయ ఉపాధి హామీ పథకం వ్యవసాయ రంగానికి అనుసందానం చేయాలి.’ అని ఆయన అన్నారు.