MLA Sticker : తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చొప్పదండి ఎమ్మెల్యే గా మేడిపల్లి సత్యం, గెలిచి నేటితో సంవత్సరం గడుస్తున్నా.. ఆ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ మాత్రం తీయకపోవడం చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గురుకుల బాట కార్యక్రమంలో, ఎమ్మెల్యే స్టిక్కర్ కెమెరాకు చిక్కింది.. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన పోయి ఏడాది గడిచింది.. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోయినప్పటికీ ఇంకా వారి కార్లపై మాత్రం ఎమ్మెల్యే స్టిక్కర్ మాత్రం తొలగించడం లేదు.
IND vs AUS: అడిలైడ్ టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్..!
ఎక్కడికి వెళ్ళినా ఎమ్మెల్యే స్టిక్కర్ తోనే మాజీ ఎమ్మెల్యేలు పర్యటిస్తున్నారు. వేములవాడ లోని బోయిన్‌పల్లి గురుకుల పాఠశాలను సందర్శించిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శంకర్ రవి శంకర్ తన కారుపై నేటి వరకు ఎమ్మెల్యే స్టిక్కర్‌ను తొలగించకుండా పలు ప్రాంతాల్లో పర్యటించడంపై పలువురు వారి తీరుపై అసహన వ్యక్తం చేస్తున్నారు.. పోలీసుల కళ్లెదుటే ఎమ్మెల్యే స్టిక్కర్ పై కారులో ప్రయాణిస్తున్న పోలీసులు మౌనం వహించడంపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.
Duddilla Sridhar Babu : తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక అడుగు.. 5 నిమిషాల్లో డ్రాయింగ్ స్క్రూట్నీ