MLA Shankar Rao: వైసీపీ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి జరిగిందని పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్ రావు అన్నారు. రూ.149 కోట్లతో అమరావతి – బెల్లంకొండ రోడ్ నిర్మిస్తున్నామని తెలిపారు. గత టీడీపీ హయాంలో సదావర్తి భూములు కాజేయాలని చూసారని… అమరావతి దేవుడి సాక్షిగా ఆ భూములను కాపాడానన్నారు. అంతేకాకుండా.. అచ్చంపేట మండలం సత్తెమ్మ తల్లి ఆలయాన్ని అభివృద్ధి చేశామని.. అటవీ శాఖ అనుమతులు తెచ్చి రోడ్ వేస్తున్నామని తెలిపారు. వైకుంఠపురం ఆలయానికి ఘాట్ రోడ్డు నిర్మాణం చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Read Also: Pithani Satyanarayana: జగన్ పై ప్రజలకు నమ్మకం లేదు.. అందుకే ఆ కార్యక్రమం మొదలు పెట్టారు
గత ఏ ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధి సీఎం జగన్ ఆశీస్సులతో చేస్తున్నామని ఎమ్మెల్యే శంకర్ రావు అన్నారు. అందుకోసమని రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్ సీఎం కావాలని ఆయన తెలిపారు. జరుగుతున్న అభివృద్ధి మరింత ముందుకు వెళ్ళాలని కోరారు. గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ, కొమ్మాలపాటి నియోజక వర్గానికి చేసింది ఏం లేదని విమర్శించారు. నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని అన్నారు. తాను చేసిన అభివృద్ధిలో పావలా వంతు కూడా టీడీపీ చేయలేక పోయిందని వ్యాఖ్యానించారు. పులిచింతల బ్యాక్ వాటర్ నుండి క్రోసూరు, అచ్చంపేట, బెల్లంకొండ మండలాలకు తాగు, సాగు నీరు ఇచ్చి తీరుతామని ఎమ్మెల్యే తెలిపారు. తన మీద పోటీ చేయించడానికి టీడీపీ నాయకులను వెతుక్కుంటుందని శంకర్ రావు విమర్శించారు.
Read Also: BY Vijayendra Yediyurappa: కర్ణాటక బీజేపీ కొత్త చీఫ్‌గా యడియూరప్ప కుమారుడు..