NTV Telugu Site icon

MLA Seethakka : చదువు కావాలంటే గొర్లు, బర్లు తీసుకోండని ప్రభుత్వం చెప్తోంది

Mla Seethakka

Mla Seethakka

వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల జాక్ నేతల దీక్షకు ఎమ్మెల్యే సీతక్క మద్దతు తెలిపారు. దీక్షా శిబిరంలో విద్యార్థులతో కూర్చొని సమస్యలు తెలుసుకున్న సీతక్క.. రేపటి కేయూ జాక్ వరంగల్ బంద్ కు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. ఉద్యమాల, పోరాటాల గడ్డ అయిన వరంగల్ కు తలమానికం కాకతీయ యూనివర్సిటీ అని ఆమె అన్నారు. త్యాగాల స్ఫూర్తిని నింపుకున్న ఎందరినో కాకతీయ యూనివర్సిటీ దేశానికి అందించిందని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉద్యమ స్ఫూర్తిని చంపేశారన్నారు సీతక్క. కేయూలో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్ర జరుగుతోందని, మెరిట్ ప్రకారం అడ్మిషన్లు ఇవ్వాలని అడిగితే సీట్లు ఇవ్వట్లేదని ఆమె మండిపడ్డారు.

Also Read : Mamata Banerjee: చంద్రబాబు అరెస్ట్పై మమతా బెనర్జీ ఏమన్నారంటే..!

అంతేకాకుండా.. ‘విద్యావ్యవస్థను పక్క దారి పట్టిస్తున్నారు. చదువు కావాలంటే గొర్లు, బర్లు తీసుకోండని ప్రభుత్వం చెప్తోంది. పోలీసులు కూడా అధికార పార్టీ తొత్తులుగా పనిచేస్తున్నారు. చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకున్న పోలీసులు విద్యార్థుల గురించి ఆలోచించాలి. స్టూడెంట్స్ ను గుండాలుగా చిత్రీకరించొద్దు. విద్యార్థుల చేతులు, కాళ్ళు విరగ్గొట్టారు. ఇదెక్కడి న్యాయమో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నేను కూడా కేయూ అధికారుల బాధితురాలిని.

Also Read : Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు పెద్దిరెడ్డి వార్నింగ్‌.. పరువు నష్టం దావా వేస్తాం..

సరైన అర్హత ఉన్నా నాకు పీ హెచ్డీ అడ్మిషన్ ఇవ్వలేదు. ఉస్మానియా యూనివర్సిటీ లో పరీక్ష రాసి జాయిన్ అయ్యాను. విద్యార్థులను వేదిస్తే తిరగబడి తరిమి కొడతారు జాగ్రత్త. విద్యార్థులపై పైశాచిక దాడిని ఖండిస్తున్నాం. వీసీ, రిజిస్ట్రార్ లను వెంటనే సస్పెండ్ చేయాలి. అక్రమార్కులను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయి. విద్యార్థుల వరంగల్ బందుకు కాంగ్రెస్ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం.’ అని ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యానించారు.

Show comments