NTV Telugu Site icon

MLA Seethakka : కర్ణాటక ఫలితాలతో మాకు బాధ్యత కూడా పెరిగింది

Seethakka On Kcr

Seethakka On Kcr

కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించిన. మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే ఎక్కువగా సీట్లు సాధించిన కాంగ్రెస్‌ పార్టీ.. కర్ణాటకలో అధికారంలోకి రానుంది. అయితే.. దీంతో.. ములుగు కాంగ్రెస్‌లో నయా జోష్ వచ్చింది. కర్ణాటక విజయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో క్యాంప్ ఆఫీస్ లో సంబరాలు జరుపుకున్నారు. కార్యకర్తలతో కలిసి స్వీట్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే సీతక్క. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడం సంతోషాన్ని, బలాన్ని ఇచ్చిందన్నారు.

Also Read : Custody: ప్రతి యాక్షన్ సీన్ ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు: సక్సెస్ మీట్ లో చైతూ

అంతేకాకుండా.. కర్ణాటక ఫలితాలతో మాకు బాధ్యత కూడా పెరిగిందని ఆమె అన్నారు. ప్రజాసంక్షేమ పాలనను కాంగ్రెస్ అందిస్తుందని.. ప్రజలు అవకాశం ఇచ్చారన్నారు. ఉన్నత వర్గాలకు, వ్యాపార వర్గాలకు బీజేపీ పట్టం కడుతుందని కర్ణాటక ప్రజలు అర్థం చేసుకున్నారని ఆమె వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కర్ణాటక ప్రజలకు భరోసాను,విశ్వాసాన్ని కల్పించారని, కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్‌కు ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

Also Read : Revanth Reddy : కర్ణాటక ఎన్నికల ఫలితాలు మాకు వెయ్యి ఏనుగుల బలం

Show comments