Custody: ప్రతి యాక్షన్ సీన్ ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు: సక్సెస్ మీట్ లో చైతూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కస్టడీ’ మూవీ శుక్రవారం తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. కృతి శెట్టి కథానాయికగా శ్రీనివాస చిట్టూరి ఈ సినిమా ను నిర్మించారు. శనివారం హైదరాబాద్ లో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఇందులో హీరో నాగచైతన్య మాట్లాడుతూ, ” ‘కస్టడీ సినిమాను ఆదరిస్తున్న తెలుగు ఆడియన్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలు. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. మేం నమ్మి చేసిన అండర్‌వాటర్ సీన్, పోలీస్ స్టేషన్ లో సింగిల్ షాట్ ఫైట్, ట్రైన్ ఫైట్, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఓ సీన్ కు మంచి స్పందన వచ్చింది. రొటీన్ గా కాకుండా కొత్తగా చేయాలని ప్రయత్నం చేశాను. ఆదరిస్తున్న ఆడియన్స్ కు అభినందనలు తెలుపుతున్నా. మమ్మల్ని నమ్మి చేసిన నిర్మాత, దర్శకుల కు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను” అని అన్నారు.
హీరోయిన్ కృతిశెట్టి మాట్లాడుతూ, ”దర్శకుడు వెంకట్ ప్రభు గారు నన్ను నమ్మి మంచి పాత్ర ఇచ్చారు. ఆ పాత్రకు థియేటర్ లో మంచి అప్లాజ్ వస్తోంది. నాగచైతన్య తో నటించడం చాలా ఆనందంగా వుంది. అలాగే ‘వెన్నెల’ కిశోర్, సంపత్ గారితో నటించడం ఆహ్లాదంగా అనిపించింది. . ఈ సినిమా హిట్ అయిందంటే అందుకు ఆడియన్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను” అని అన్నారు. ఆర్ట్ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ, ”ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశాలు చాలా వున్నాయి. పోలీస్ స్టేషన్ ఫైట్ గానీ, అండర్ వాటర్ సీన్ గానీ ఖర్చుపెట్టి నిర్మాత తీయించారు. అవి చాలా అద్భుతంగా దర్శకుడు తీశారు. థియేటర్ లో వాటికి మంచి స్పందన వస్తోంది” అని అన్నారు. చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు మాట్లాడుతూ, ”తెలుగులో నేను చేసిన మొదటి సినిమాకి వస్తున్న గొప్ప ఆదరణకు థ్యాంక్స్. వందశాతం మా కష్టం ఫలించింది అనుకుంటున్నాను. అంబులెన్స్ తో కంపేర్ చేస్తూ కొన్ని రివ్యూలు చూశాను. అలా వారు రాసినందుకు థ్యాంక్స్. యాక్షన్ ఫిలిం ఇది. యాక్షన్ పరంగా బాగున్నాయని రాశారు కూడా. 4 నిముషాల సింగిల్ షాట్ ఫైట్ ను మహేష్ కొరియోగ్రఫీ చేశారు. ఈ రిస్కీ షాట్ ను అవసరమైతే మరోసారి చేస్తాను అనికూడా నాగచైతన్య అన్నారు. ఆయన డెడికేషన్ నచ్చింది. ‘కస్టడీ’ సినిమాను తెలుగు, తమిళంలో కూడా బాగా ఆదరిస్తున్నారు. కుటుంబంతో వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేయండి” అని కోరారు. నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి మాట్లాడుతూ, ”’కస్టడీ’ బ్లాక్ బస్టర్ అయినందుకు ఆనందంగా వుంది. కథలో ఏది నమ్మామో అది వర్కవుట్ అయింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెబుతున్నాం” అని అన్నారు.
Also Read
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
తాజావార్తలు
-
OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
-
Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ మామూలుగా లేదుగా!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!