తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొన్ని విషయాలు తెలియాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. మా ఎమ్మెల్యే లను కొనుగోలు చేయాలన్న ప్రయత్నం మీ అందరికీ తెల్సిందే. సిట్ ద్వారా అందరికీ వీడియోలు వెళ్ళాయి…మా కుటుంబ సభ్యుల ను వేధిస్తున్నారు. టీఆర్ఎస్ ను బీఅర్‌ఎస్ గా మార్చడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఫిర్యాదుదారుడుని నాకీ ఈడీ నోటీసులు పంపించింది. నాకు ఏ కేసో కూడా తెలియడం లేదు. ఇక రెండో రోజు నేను కేసు వివరాలు చెప్పకపోతే నేను రాను అంటే అప్పుడు చెప్పారు. ఎమ్మెల్యే ల కొనుగోలు కేసు అని.. ఈ కేసు లో సంబంధం లేని అభిషేక్ కు నోటీసులు ఇచ్చారు. ఈడీ అనేది మనీ లాండరింగ్ జరిగితే వస్తుంది.
ఈ కేసులో ఎక్కడ మనీ లాండరింగ్ జరగలేదు…. అసలు మనీ నే లేదు. ఇక్కడ ఉల్టా జరుగుతుంది… ఫిర్యాదుదారుడు అయ్యిన నన్నే ప్రశ్నలు అడుగుతున్నారు. మా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు రూట్ మార్చి నంద కుమార్ ని విచారించి నా మీద కేసు పెట్టాలని చూస్తున్నారు. నంద కుమార్ స్టేట్మెంట్ మార్చి నన్నే ముద్దాయిగా మార్చాలని చూస్తున్నారు. మీరు ఎన్ని ఆరోపణలు చేసిన నేను తగ్గేది లేదు. బీజేపీ వాళ్లు 8 రాష్ట్రాలను పడగొట్టిన ఎక్కడ ఎవరు ఎదురు తిరగలేదు. కానీ ఇక్కడ తెలంగాణ ఎదురు తిరిగింది… దాన్ని తట్టుకోలేక పోతున్నారన్నారు రోహిత్ రెడ్డి.
ఇప్పుడు కొత్త కుట్రను నేను భగ్నం చేశా. మేము కూడా నేను హైకోర్టు లో రిట్ వేయబోతున్నాం. ఇది రోహిత్ రెడ్డి సమస్య కాదు… ఇది తెలంగాణ రాష్ట్ర సమస్య. బంగారు తెలంగాణ ని చూసి ఓర్వలేక పోతున్నారు. అందుకే ఈ కుట్రలు పన్నారు. బీజేపీ దగ్గర త్రిశూలం ని వాడుతున్నారు… అవి CBI,ED, ఐటీ. మనం మరోసారి ఉద్యమ బాట పట్టాల్సిందే. బీజేపీ వాళ్లు ఎప్పుడు చూసిన మతం, కులం, ఇవే…నేను రేపు హైకోర్టులో రిట్ వేయబోతున్నా అన్నారు. సైనికుడిగా ఈ కుట్రలను తిప్పికొడతా అన్నారు. ఈ కేసు ఈడీ లిమిట్స్ లోకి అసలు రాదు..కానీ అధికారం ఉంది కదా అని అన్ని ఆయుధాలు వాడుతున్నారు. రెండు రోజులు విచారించారు.. కానీ నా దగ్గర ఏం దొరకలేదు. కాబట్టి నంద కుమార్ ద్వారా నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు రోహిత్ రెడ్డి.
నేను దొంగను కాదు కాబట్టి నేను దేనికైన సిద్దం. BL సంతోష్, తుషార్ ఎందుకు విచారణకు రావడం లేదు. దేనికీ భయపడం. ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి. స్టే ఎందుకు తెచ్చుకుంటున్నారు. నన్ను ఎందుకు విచారణ చేశారు అని నేను కోర్టు కు వెళ్తున్నా. BL సంతోష్ నేరం బయట పడుతుంది అనే స్టే లు తెచ్చుకుంటున్నారు. 27 న ఈడీ విచారణకు హాజరవుతా… ఆ లోపు కోర్టుకు వెళ్తనన్నారు.
Read Also: Covid BF.7 Variant: భారతీయుల్ని ఏ వేరియంట్ ఏం చేయలేదు.. బీఎఫ్-7 మన ముందు జుజుబీ..ఎందుకంటే..?