NTV Telugu Site icon

MLA Rekha Nayak : ఇప్పుడు అయితే నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే

Rekha Nayak

Rekha Nayak

కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ కూడా గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 95-105 సీట్లు గెలుస్తుందని సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

Also Read : Bandi Sanjay : గజ్వేల్‌లో ఓడిపోతననే కేసీఆర్‌ కామారెడ్డికి పోతుండు

అయితే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాల్లో బీఆర్‌ఎస్ 95-105 స్థానాల్లో విజయం సాధిస్తుందని కేసీఆర్‌ విలేకరుల సమావేశంలో అన్నారు. అంతేకాకుండా.. ఎంఐఎం, హైదరాబాద్‌ లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీతో బీఆర్‌ఎస్‌ స్నేహం కొనసాగుతుందని కేసీఆర్‌ ప్రకటన చేస్తూనే చెప్పారు. అయితే.. బోథ్‌, ఖానాపూర్, వైరా, కోరుట్ల, ఉప్పల్, ఆసిఫాబాద్, మెట్‌పల్లి ఏడు స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను మార్చింది. కాగా, గోషామహల్, నాంపల్లి, జనగాం, నర్సాపూర్ నాలుగు నియోజకవర్గాలకు అధికార పార్టీ అభ్యర్థులను ఖరారు చేయలేదు.

Also Read : Pakisthan: పాకిస్థాన్ లో కొద్దీ ఇళ్లకు, చర్చిలకు నిప్పు..

అయితే.. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ ప్రస్తుత ఎమ్మెల్యే రేఖా నాయక్‌ స్థానంలో జాన్సన్‌కు అవకాశం ఇచ్చింది బీఆర్‌ఎస్‌ అధిష్టానం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేఖా నాయక్‌ స్పందిస్తూ.. ఇంకా 50 రోజుల వరకూ నేను ఎమ్మెల్యేగా ఉంటానన్నారు. మిగిలిన పనులు చేస్తానని, ఇప్పుడు అయితే నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని ఆమె వ్యాఖ్యానించారు. నేను ఇంకా వేరే ఆలోచించ లేదని, లాస్ట్ ఊపిరి వరకు ఖానాపూర్ లో ఉంటానని ఆమె వెల్లడించారు. ఖానాపూర్ ప్రజలే నా అమ్మానాన్న అని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారే ఆలోచన చేయలేదని, నా జీవితం ప్రజలకు అంకితమన్న రేఖానాయక్‌.. చావైనా బతుకైనా ఇక్కడే అని వ్యాఖ్యానించారు.

అయితే.. రేఖా నాయక్ 2009లో రాజకీయాల్లోకి ప్రవేశించి భారత జాతీయ కాంగ్రెస్ తరపున ఆసిఫాబాద్ జెడ్పీటీసీ మెంబర్ గా పోటీచేసి విజయం సాధించింది. 2013లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించింది. 2014లో ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రితేష్ రాథోడ్ పై 30వేల మెజారిటీతో విజయం సాధించింది. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రమేష్ రాథోడ్ పై 24,300 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది.