మూడో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవం చేయడానికి మంత్రులు సిద్ధం అవుతున్నారని, నా నియోజకవర్గంలో మొదటి విడతలో ఐదు వందల మందికి ఇచ్చారన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. రెండో విడతలో ఐదో వందల మందికి ఇచ్చారని, మూడో విడతలో ఇప్పుడు 1500 మందికి ఇస్తున్నారన్నారు. ధూల్‌పేట్‌లో గుడుంబా అమ్ముకొని బ్రతికే వారు చాలా మంది ఉండేవారని, మీ ప్రభుత్వం వచ్చాక గుడుంబా పూర్తిగా బంధు జేయించారన్నారు. వారి మీద పీడీ యాక్ట్, గుండా యాక్ట్ లు పెట్టీ గుడుంబా బంధు జేయించుండ్రు.. కానీ వారికి ఇప్పటి వరకు ప్రత్యామ్నాయo చూయించలేకపోయారని ఆయన వ్యాఖ్యానించారు. ధూల్‌పేట్ ప్రజలకు రియాబిలిటేషన్ చూయించాలని అసెంబ్లీలో కేసీఆర్ చెప్పిండని, నేను కూడా అనేక సార్లు అసెంబ్లీ లో ప్రస్తావించానని, ధూల్‌పేట్ కు వస్తానని కేసీఆర్ ప్రజలకు హామీ ఇచ్చి మర్చిపోయిండని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
Also Read : Allola Indrakaran Reddy : అక్టోబర్ 4న నిర్మల్‌కు కేటీఆర్.. ఏర్పాట్లపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష
ప్రస్తుతం ఇస్తున్న 1500 డబుల్ బెడ్రూం ఇండ్లలో అర్హులైన ధూల్‌పేట్ వారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. గుడుంబా మానేసిన వారిని ఐడెంటిఫై చేసి రియాబిలిటేషన్ కింద ఇండ్లను ప్రకటిoచాలని, ధూల్‌పేట్ ప్రజలను ఆదుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. అర్హులైన వారికి కాకుండా వేరే వారికి ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకుంటామన్నారు. లోకాల్లో చాలా గొడువలు అయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఏం జరిగినా దానికి ప్రభుత్వమే భాధ్యత వహించాలని రాజాసింగ్ అన్నారు.
అంతేకాకుండా.. బండి సంజయ్ కార్యాలయంపై ఎంఐఎం కార్యకర్తల దాడిపై రాజాసింగ్ స్పందిస్తూ.. బండి సంజయ్ ఇంటి మీద ఎంఐఎం దాడిని ఖండిoచారు రాజాసింగ్. బండి సంజయ్ ఇంటి మీద ఎంఐఎం కార్యకర్తలు రాళ్ల దాడి.. ఎoఐఎం, టిఆర్ఎస్ పార్టీల నేతలకు బండి సంజయ్ అంటే భయం పుట్టుకొస్తుందా అని ఆయన అన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని బండి సంజయ్ ప్రకటించాక ఎంఐఎం, బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని, ఎంఐఎం నేతలకు, కార్యకర్తలకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని చెప్పినా బీసీ మంత్రి గంగుల కమలాకర్ ఈ విధంగా సహాయపడుతున్నారా..? అని ఆయన అన్నారు. బండి సంజయ్ దేనికి భయపడరు గుర్తించుకోండని, మీరు ఒక్క రాయి వేస్తే మీ మీద 100 రాళ్లు పడతాయి యాది పెట్టుకోండని ఆయన అన్నారు. ఎవరు అడ్డుపడిన, ఎన్ని దాడులు చేసినా బండి సంజయ్ తప్పకుండా పోటీ చేస్తారు గెలుస్తారని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.