Site icon NTV Telugu

MLA Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

Rajasingh

Rajasingh

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ అరెస్ట్‌ ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయాలను వేడెక్కించింది. అయితే.. బండి సంజయ్‌అరెస్ట్‌ను నిరసిస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళనను చేపట్టారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ అరెస్ట్ వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిరసనకు దిగారు. బండి సంజయ్ ను వరంగల్ కు తరలిస్తుండగా పార్టీ కార్యకర్తలతో కలిసి రాజాసింగ్ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ న కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, సంజయ్ అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సంజయ్‌ అరెస్ట్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు పోలీసు స్టేషన్‌కు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దించారు.

Also Read : Sabitha Indra Reddy : మీ స్వార్ధ రాజకీయాల కోసం విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడుతారా

ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీస్‌స్టేషన్‌కు 2 కిలోమీటర్ల మేర బారికేడ్లు ఏర్పాటు చేశారు. రఘునందన్ రావుతో పాటు ఆయన మద్దతుదారులను కూడా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు అధికారులను కలవాలనుకున్న ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకుని వాహనంలో తరలించారు. మహిళలతో సహా ఆందోళనకారులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సంజయ్ అరెస్టులో పోలీసులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించారని రఘునందన్ ఆరోపించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) సహాయంతో తెలంగాణలో బిహార్ తరహా అరాచకాన్ని బిఆర్‌ఎస్ ప్రభుత్వం సృష్టిస్తోందని ఆయన అన్నారు. డీజీపీ అంజనీ కుమార్‌ను బీహారీ గుండా అని కూడా వ్యాఖ్యానించారు.

Also Read :Rajashekar: జీవిత నన్ను బ్రిడ్జిపై నుంచి తోసేసి.. మా అమ్మానాన్నల ముందు..

Exit mobile version