NTV Telugu Site icon

MLA Raghurami Reddy: డీఎల్ పై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

dl vs rr

Collage Maker 22 Dec 2022 04.58 Pm

ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి. అందునా సీఎం జగన్ స్వంత జిల్లా కడప రాజకీయాల్లో ఎప్పుడూ మాటల మంటలు రేగుతుంటాయి. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిపై మరోమారు విరుచుకుపడ్డారు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి. డీఎల్ రవీందారెడ్డి వైసీపీపై చేసిన ఆరోపణలు కుట్ర పూరితమైనవి అన్నారు. ఆయనో పెద్ద అవినీతి పరుడు..2014లో ఆయన కాంగ్రెస్ లో ఉంటూ టీడీపీ అభ్యర్థి సుధాకర్ యాదవ్ గెలుపు కోసం ఆయన సతీమణి సుభద్ర జనరల్ ఏజెంటుగా పనిచేశారన్నారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరినా ఎన్నికలప్పుడు టిడిపికి ఓటెయ్యమని చెప్పి..నాకు, పార్టీకి ద్రోహం చేశావన్నారు.

Read Also: Samantha: ఒప్పుకున్న సినిమాల నుంచి తప్పుకోలేదు…

పార్టీకి ద్రోహం చేసి ఇప్పుడు పార్టీల్లో ఉన్నానని చెప్పుకోవడానికి సిగ్గు లేదా? పార్టీలో చేరాక ఒక్క పార్టీ కార్యక్రమంలో నైనా పాల్గొన్నావా? డీఎల్ ను పావుగా ఉపయోగించుకుని ఎల్లో ఈ మీడియా వినియోగించుకుంది.. నీ తండ్రి ఎంత ఆస్తి ఇచ్చావు..ఇప్పుడు ఎంత ఆస్తి ఉంది? హైదరాబాదులో 5O లక్షల బాడుగలు వచ్చే ఆస్తులు ఉన్నాయి నీకు. అవి ఎక్కడివన్నారు రఘురామిరెడ్డి. నువు ఏ పార్టీకి నిజాయితీగా పనిచేయలేదు.. నీ రాజకీయ చరిత్ర చూస్తే తెలుస్తుంది.. విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వం లో కల్తీ మద్యం అమ్మి 20 మంది చనిపోవడానికి కారణం నువ్వే అని ఆరోపించారు.

మంత్రిగా అప్పుడు బర్తరఫ్ చేశారు..నీకు ఎథిక్స్ లేవు..దమ్మూ ధైర్యం ఉంటే 2024లో పోటీ చేస్తానని ప్రకటించు..ఖాజీపేట సొంత పంచాయతీ సుంకేసులలో నీవు గెలవలేక పోయావు..నిన్ను ఎవరూ నమ్మారు..కాంగ్రెస్ లో మంత్రిగా ఉంటూ జగన్ పై ఎంపీగా పోటీ చేశావు. నీకు కనీసం డిపాజిట్ కూడా రాలేదన్నారు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి. ఇదిలా ఉంటే… మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీలో చేరలేదన్నారు వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు కె.సురేష్ బాబు. ఆయనకు పార్టీ సభ్యత్వం లేదు..ఈ కార్యక్రమాల్లో పాల్గొనలేదు..పార్టీకి ఎప్పుడూ పని చేయలేదు అన్నారు సురేష్ బాబు.

Read Also: Sreeleela: స్టార్ హీరోయిన్లే ఆ పనికి ఒప్పుకున్నారు.. అందుకే నేను కూడా ఒప్పుకున్నా