Sreeleela: స్టార్ హీరోయిన్లే ఆ పనికి ఒప్పుకున్నారు.. అందుకే నేను కూడా ఒప్పుకున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sreeleela: ప్రస్తుతం టాలీవుడ్ కుర్రకారును గిలిగింతలు పెడుతున్న హీరోయిన్ శ్రీలీల. దర్శకేంద్రుడి చేతుల మీదగా పరిచయం అయిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ సినిమా తరువాత స్టార్ హీరోల సరసన అవకాశాలను అందుకొని ఔరా అనిపించింది. ప్రస్తుతం శ్రీలీల, రవితేజ సరసన ధమాకాలో నటించింది. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రేపు రిలీజ్ కానుంది. దీంతో శ్రీలీల వరుస ఇంటర్వ్యూలు ఇచ్చేస్తూ సినిమా కబుర్లు చెప్పుకొస్తుంది. ఇక రవితేజ గురించి ఈ అమ్మడు చెప్పిన వ్యాఖ్యలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని మాస్ మహారాజా ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.
రవితేజతో నటించడం చాలా సంతోషంగా ఉందని, ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడం ఎవరి వలన కాదని చెప్పుకొచ్చింది. ఇక రవితేజ లాంటి సీనియర్ హీరోలతో నటించడం, ఏజ్ గ్యాప్ గురించి అడిగిన ప్రశ్నకు శ్రీలీల గట్టిగానే సమాధానం చెప్పింది. “నాకన్నా ముందు స్టార్ స్టార్ హీరోయిన్లే.. తమకంటే ఎక్కువ వయస్సు ఉన్న హీరోలతో కలిసి నటించారు. వారే ఏజ్ గురించి పట్టించుకోలేదు. ఇక నేనేంత చెప్పండి”అంటూ నవ్వేసింది. అమ్మడు నార్మల్ గా చెప్పినా గట్టి కౌంటర్ అయితే ఇచ్చిందని తెలుస్తోంది. మరి ఈ కుర్ర హీరోయిన్, సీనియర్ హీరోతో ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.
Also Read
- Balakrishna: మోక్షజ్ఞ మూవీలో బాలయ్య రోల్ అంతేనా?
- Allu Arjun: చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం ఆయనకే సాధ్యం: ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ క్రేజీ రివ్యూ!
- Teja Sajja: డిసెంబర్లో పెళ్లి.. అమ్మాయి ఎవరో క్లారిటీ ఇచ్చేసిన తేజ సజ్జ
- Dhanush - Aishwaryaa: ధనుష్ - ఐశ్వర్య మళ్లీ కలుస్తున్నారా? అనిరుధ్ పెళ్లి వేదికగా బిగ్ ట్విస్ట్!
తాజావార్తలు
-
Balakrishna: మోక్షజ్ఞ మూవీలో బాలయ్య రోల్ అంతేనా?
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Allu Arjun: చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం ఆయనకే సాధ్యం: ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ క్రేజీ రివ్యూ!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Chikkadpally: యువతితో అసభ్య ప్రవర్తన.. ఘర్షణలో డీఆర్డీవో ఉద్యోగి మృతి
ట్రెండింగ్
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!
-
Home Remedies : తెల్ల సాక్సులపై నల్ల మరకలా? ఇలా సింపుల్ చిట్కాలతో వదిలించండి
-
Harry Brook: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో హరీ బ్రూక్ విధ్వంసం..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 లాంచ్..!
-
Home Cleaning : దీపావళి వేళ.. ఇంట్లో బల్లులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా? ఈ చిట్కాలు ట్రై చేయండి.!