Site icon NTV Telugu

MLA Raghunandan Rao : తెచ్చిన అప్పులు ఎలా ఖర్చు అవుతుంది అనేది చర్చ

Mla Raghunandan Rao

Mla Raghunandan Rao

తెలంగాణలో బీజేపీ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌ అన్నట్టుగా రాజకీయం సాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. అయితే.. నిన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను స్పీకర్‌ సస్పెండ్‌ చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే.. తాజాగా నేడు అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే రఘునందన్‌ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ మోడీ వచ్చినప్పుడు నాకేం వద్దు ప్రేమ ఉంటే చాలు అన్నారు. టాక్స్ లో వాటా నీ పెంచింది మోడీ.. అప్పు తప్పు కాదు.. తెచ్చిన అప్పులు ఎలా ఖర్చు అవుతుంది అనేది చర్చ.. ఎఫ్‌ఆర్‌బీఎం లిమిట్ లోపల అప్పులు చేయాలి.. కరోనా ఇబ్బంది గుర్తించి 4.5 కి ఎఫ్‌ఆర్‌ఎంబీ పరిధి పెంచారు మోడీ. జీఎస్టీ మీటింగ్ కి ఆర్ధిక మంత్రి పోతున్నారు. అక్కడ చర్చ చేస్తే అయిపోతుంది. ఉన్నది ఉన్నట్టు చెప్తున్న.. కేంద్రం నీ బద్నాం చేయడానికే నా ఈ చర్చ.

 

ఎఫ్‌ఆర్‌ఎంబీ పరిధిలోనే మాట్లాడుతున్న అంటూ రఘునందన్‌రావు మాట్లాడుతుండగా.. రఘు నందన్ రావు స్పీచ్ కి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారు. అనంతరం రఘునందర్‌ రావు తన స్పీచ్‌ కొనసాగిస్తూ.. మిషన్ భగీరథకి తెచ్చిన అప్పులు దానికే ఖర్చు చేశారా.. అంబేద్కర్ నీ గౌరవించింది మేము.. 2014 జూన్ 2 తర్వతా ప్రజల మీద అప్పు పెరిగింది. పుట్టబోయే బిడ్డ మీద కూడా అప్పు చేసింది. మీరు ఆంధ్ర కాంట్రాక్టర్‌ల కోసం చేస్తున్నారు అప్పు అంటూ రఘునందన్‌ రావు విమర్శించడంతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.

 

Exit mobile version