NTV Telugu Site icon

MLA Raghunandan Rao : చట్టానికి ఎవరు చుట్టం కాదని ఇప్పటికైనా తెలుసుకో

Mla Raghunandan Rao

Mla Raghunandan Rao

దుబ్బాక పట్టణంలో బుధవారం నిర్వహించిన నియోజకవర్గ బూత్ స్వశక్తి కరణ్ అభియాన్, భారత రాష్ట్రపతి ప్రసంగం వర్క్ షాప్‌లో ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కపోయిన చెల్లెమ్మ కవిత.. తెలంగాణ ఆడపడుచులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ మరో తప్పు చేయోద్దని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అవినీతి చేస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోందని విమర్శించిన వాళ్లకు చెల్లె కవితకిచ్చిన ఈడీ నోటీసులే సమాధానం చెబుతాయన్నారు.

Also Read : Silpa Chakrapani Reddy: మళ్లీ టీడీపీలోకి శిల్పా చక్రపాణిరెడ్డి..? క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే..

బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవినీతి చేస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది అన్న వారికి జవాబు కవితకు ఈడీ నోటీసులు అని ఆయన అన్నారు. లిక్కర్ స్కామ్ లో మీరు ఆదాయం పెంచుకోవడానికి ఎందుకు తలదూర్చారో గుర్తు తెచ్చుకోవాలి చెల్లె కవిత అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆస్తుల కోసం ఢిల్లీలో లిక్కర్ దందా నువ్వు చేసి ఈ రోజు అందరిని కలపడం బాధాకరమన్నారు. కవితమ్మ ముద్దాయి అని తెలుపుతూ నోటీసులు ఇచ్చింది ఈడీ.. మోడి కాదని ఆయన అన్నారు. నోటీసులు ఇస్తే నేను ఎదుర్కొంటా అంటివి ఇప్పుడు ఎదుర్కో చెల్లే అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Anushka Shetty: ఎవడ్రా స్వీటీ రేంజ్ పడిపోయింది అంది.. వస్తుంది చూడు

గతంలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి కూడా నీలాగ తప్పిచ్చుకుందామనుకుండు.. కానీ తప్పలేదని, చట్టానికి ఎవరు చుట్టం కాదని ఇప్పటికైనా తెలుసుకో అని ఆయన అన్నారు. చట్టం తనపని తను చేసుకుంటదని నిన్నటి దాకా మీరు చెప్పిన మాట నిజమైతే విచారణను ఎదుర్కోండని ఆయన అన్నారు.