NTV Telugu Site icon

MLA Raghunandan Rao : బీఆర్‌ఎస్‌ పార్టీ కండువ ఎసుకున్న వారికే కులవృత్తుల సహాయం

Raghunandan Rao On Kcr

Raghunandan Rao On Kcr

కామారెడ్డి జిల్లా డబుల్ బేడ్ రూం ఇండ్లని పేద ప్రజలకి ఇవ్వాలని కోరుతూ చేపట్టిన ధర్నాలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండ్లు లేని నిరుపేదలకి డబుల్ బేడ్ ఇస్తానాని చెప్పిన హామీ నిరాశగా మారిందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలకి అన్యాయం చేసిందని, ఓట్ల కోసం మాత్రమే కేసిఆర్ కి పథకాలు గుర్తుకొస్తాయని ఆయన మండిపడ్డారు. దళిత బంధు కామారెడ్డి జిల్లాలో ఎంత మందికి ఇచ్చారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ కండువ ఎసుకున్న వారికే కులవృత్తుల సహాయం వస్తుందని, తీపి మాటలతో ప్రజలని కేసీఆర్ మభ్య పెడతున్నాడని ఆయన ఆరోపించారు.

Also Read : Viral Video: జేబులో ఫోన్ కొట్టేస్తే వీడియో చూసే దాకా తెలియలేదు.. జాగ్రత్త బాసూ!

బూత్ స్థాయి అధికారులు గ్రామగ్రామన కేసిఆర్ చేపట్టిన ఆరాచకాలని ప్రజలకి తెలపాలని ఆయన సూచించారు. లక్ష రుపాయల నుండి రెండు లక్షల వరకి గృహా పథకాన్ని నరేంద్ర మోడీ ప్రవేశపెడితే అట్టి పథకాన్ని కేటీఆర్ రద్దు చెపిచ్చిండు అని ఆయన దుయ్యబట్టారు. ప్రధానమంత్రి అవాస్‌ యోజన క్రింద గరిబోల్లకి కేంద్రం ఇండ్లు కట్టిచ్చిందని, గృహా లక్ష్మీ పథకం క్రింద 3 లక్షల పథకం ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రఘునందన్‌.

Also Read : Samantha: సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ఆ పని చేస్తున్న సామ్ ..

అసెంబ్లీ సమావేశాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లపై పోరాటాం చేస్తామని, లంచం రూపంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గృహ లక్ష్మీ పథకాన్ని వాడుకుంటుందని, కులవృత్తులపై ఆధారపడిన వారికి బీసీ బంధు రాదు… కేవలం గులాబీ కండువ కప్పుకున్న వారికే వస్తుందని ఆయన అన్నారు. నాలుగేండ్ల నుండి కామారెడ్డిలో కట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్లని ప్రజలకీ ఎందుకు ఇవ్వాలేదని, అగస్టు 15 వరకి డబుల్ బెడ్‌ రూం ఇండ్లు ఇవ్వకపోతే ప్రతి గ్రామంలో ధర్నాలు చేయండని, మూడు నెలల తరువాత తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

Show comments