Site icon NTV Telugu

Raghunandan Rao : బీజేపీ కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదు

Raghunan Rao

Raghunan Rao

MLA Raghunandan Rao Fires CM KCR

యాదాద్రి జిల్లా నారాయణపురంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. మూడు సంవత్సరాలు ఒకే దగ్గర పనిచేస్తున్న రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ను వెంటనే బదిలీ చేయాలన్నారు. ఇప్పటికే లేఖ రాశాము…మరోసారి ఆయన బదిలీ విషయం ఎలక్షన్ కమిషన్ కు గుర్తు చేస్తామన్నారు. పోలీస్ అధికారులు ఇష్టా రీతిలో బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తే ఊరుకొమన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా నియోజకవర్గంలో పనిచేస్తున్న అధికారులు స్వచ్ఛందంగా ఇక్కడి నుండి వెళ్లిపోవాలన్నారు. బీజేపీ కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదన్నారు. మునుగోడు ప్రజలు కేసీఆర్ వైపు ఉంటారో ఆయనను ఓడగొట్టే పార్టీవైపు ఉంటారో నిర్ణయించుకోవాలన్నారు. అసలుసిసలు యుద్ధం దుబ్బాక తో మొదలైందని హుజురాబాద్ నుండి ఇప్పుడు మునుగోడుకు చేరుకుందన్నారు.

 

ఒక్కో ఎమ్మెల్యే మంత్రులు సూట్ కేసులో డబ్బులు తీసుకొని నియోజకవర్గంలో ఓటర్లను కొనుగోలు చేయాలని చూస్తున్నరని, అసెంబ్లీలో బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలకు రూమ్ కేటాయించమని చెబితే ముగ్గురు ఎమ్మెల్యేలు ఉంటే ఇవ్వమని ఐదుగురు ఎమ్మెల్యేలు ఉండాలని చెప్పారు, తాము ఐదుగురు ఎమ్మెల్యేలo వస్తామని… అది త్వరలోనే అదే జరుగుతుందనీ స్పీకర్ తో చెప్పామన్నారు. కంకి కొడవలి, సుత్తి కొడవలి, ఏనుగు గుర్తు లను, ముఖ్యమంత్రి కేసీఆర్ కొనుక్కున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టులను సూది, దబ్బుడం పార్టీలనీ తిట్టిన కేసీఆర్ వెనక కూర్చొని వారు పని చేయడంపై ప్రజలు ఆలోచన చేయాలి.. ఏడాది కంటే ఎక్కువ గులాబీ జెండా రాష్ట్రంలో ఎగరదని ఆయన జోస్యం చెప్పారు.

 

Exit mobile version