అయోధ్యలో శ్రీరాముడు బీజేపీకి సొంతం కాదు.. ఆస్తి అంతకన్నా కాదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శుక్రవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ తీరును నిశితంగా ఆక్షేపించారు. శ్రీరాముని పేరుతో ఓట్ల రాజకీయం చేయడం శోచనీయం అని అన్నారు. శ్రీరాముడు ప్రపంచంలోని ప్రతి హిందువు ఆరాధ్యదైవమని అన్నారు. కాంగ్రెస్ హిందువు, శ్రీరామునికి వ్యతిరేకమనే ప్రచారం ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే బీజేపీ కుట్రను ఖండించారు. శ్రీరాముని కల్యాణం తరువాత అక్షింతలను పంచడం ఆనవాయితీ కాగా.. విగ్రహాల ప్రాణప్రతిష్ఠ ముందు అక్షింతలను పంచడం విడ్డురంగా ఉందని విమర్శించారు.
Read Also: Mallu Ravi: మోడీ పాలనలో దేశ ప్రజలు స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి లేదు..
కాంగ్రెస్ హయాంలో అనేక హిందువు దేవాలయాలు, శ్రీరాముని ఆలయాలు నిర్మాణం జరిగాయని ఆయన విషదీకరించారు. ఇప్పటికైనా బీజేపీ శ్రేణులు దేవుని పేరుతో సెంటిమెంట్ రగిలించి ఓట్లు పొందాలనే ఆలోచనకు స్వస్తి పలకాలని సూచించారు. సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని అధికారంలోకి రావాలనే కేసీఆర్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా నరేంద్ర మోదీ ఓటమి చెంది రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యమని ప్రేమ్ సాగర్ రావు అన్నారు.
Read Also: Assam : రూ. 68.41 కోట్ల విలువైన డ్రగ్స్ ను సీజ్ చేసిన అధికారులు..