Ayodhya: అయోధ్యకు రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ట్రస్టు అధికారులు ముందస్తు దర్శన సమయాన్ని పెంచారు. ఈ క్రమంలో అయోధ్య రామమందిరంలో మరో ఉత్సవం జరగనుంది.
అయోధ్యలో శ్రీరాముడు బీజేపీకి సొంతం కాదు.. ఆస్తి అంతకన్నా కాదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శుక్రవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ తీరును నిశితంగా ఆక్షేపించారు. శ్రీరాముని పేరుతో ఓట్ల రాజకీయం చేయడం శోచనీయం అని అన్నారు. శ్రీరాముడు ప్రపంచంలోని ప్రతి హిందువు ఆరాధ్యదైవమని అన్నారు. కాంగ్రెస్ హిందువు, శ్రీరామునికి వ్యతిరేకమనే ప్రచారం ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే బీజేపీ కుట్రను ఖండించారు. శ్రీరాముని కల్యాణం తరువాత అక్షింతలను…