Pocharam: అసెంబ్లీలో బీఆర్ఎస్‌ను తక్కువ చేస్తే మా తడాఖా చూపిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామారెడ్డి: కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మర్యాదగా ప్రవర్తిస్తే మేము కూడా మర్యాదగా ఉంటాం.. లేదంటే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మేమేంటో చూపిస్తామని హెచ్చరించారు. బాన్సువాడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు.
Read Also: Republic Day 2024: భారతదేశంలో త్రివర్ణ పతాకాన్ని తయారు చేసిన ఆ మూడు ప్రదేశాలేంటో తెలుసా ?
Also Read
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
- YCP Office Fire: వైసీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు, 10 వాహనాలు దగ్ధం!
- Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.!
- Rajnath Singh: బంగ్లాదేశ్ తరహా అస్థిరతను సృష్టించేందుకు కుట్ర?.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..
అసెంబ్లీలో 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని.. అది ఏ మాత్రం చిన్న సంఖ్య కాదని పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అలాగే 25 మంది ఎమ్మెల్సీలు, 14 మంది ఎంపీలు బీఆర్ఎస్‌కు ఉన్నారని గుర్తు చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్‌ను ఎక్కువ.. తక్కువ చేస్తే మా తడాఖా ఏంటో చూపిస్తామని చెప్పుకొచ్చారు. ఆరు గ్యారంటీలు అమలు చేయడానికే ప్రభుత్వం కింద మీద పడుతుందని ఎద్దేవా చేశారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అయితే డబ్బులు జమ చేయాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. అయినా డబ్బులేమైనా ప్రింటింగ్ చేస్తారా? వచ్చిన ఆదాయాన్నే పంచాలని వివరించారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అయినా కాంగ్రెస్‌వి 420 హామీలని హేళన చేశారు. తక్కువ మెజార్టీతో 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోయారని.. లేదంటే బీఆర్ఎస్సే అధికారంలోకి వచ్చేదని చెప్పుకొచ్చారు. 10 ఏళ్లు పరిపాలించాం.. కానీ రెండు నెలలకే ఇంత దౌర్జన్యం చేయలేదని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో నూటికి నూరు శాతం బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
-
YCP Office Fire: వైసీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు, 10 వాహనాలు దగ్ధం!
-
Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.!
-
Rajnath Singh: బంగ్లాదేశ్ తరహా అస్థిరతను సృష్టించేందుకు కుట్ర?.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
Mobile Sales: అమ్మో.. స్మార్ట్ ఫోన్..! అంత పెట్టి కొనలేం బాబోయ్
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!