Site icon NTV Telugu

Malladi Vishnu: కన్నా దెబ్బకు సోము వీర్రాజుకి పిచ్చిపట్టింది

Vishnu Malladi

Vishnu Malladi

ఏపీలో బీజేపీ నేతలపై మండిపడుతున్నారు అధికార వైసీపీ నేతలు. విజయవాడలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. గడప గడప లో సంక్షేమం తో పాటు సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించే దిశగా ముందుకుపోతున్నాము.ప్రతిపక్షాలు మా మీద బురద జల్లుతున్నారు.బీజేపీ సోము వీరాజు,సునీల్ దేవ దర్ హిందువులకు వ్యతిరేకంగా వైసీపీ ట్విట్టర్ లో పోస్ట్ చేసిందని ఆరోపణలు చేశారు. దీనిపై వ్యాఖ్యలు చేయడానికి వీరికి అర్హత లేదన్నారుఉ మల్లాది విష్ణు.

తెలుగులో చేసిన ట్వీట్ కు నానా అర్థాలు తీయొద్దు. సోము వీర్రాజు కు పిచ్చి పట్టింది. కన్నా దెబ్బకి ఆయన ఏమి మాట్లాడుతూన్నారో అర్థం కాకుండా ఉంది. మీరు కూల్చిన దేవాలయాలు మేము క్రమ పద్దతి లో తిరిగి నిర్మిస్తున్నాం అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బీజేపీ కి ప్రజలే బుద్ధి చెబుతారు…సోము వీర్రాజు ఒక గాడిద నిన్ను అనడానికి ఈ మాట కన్నా దిగజారుడు పదం ఇంకేమైనా ఉందో చూసుకో అని మండిపడ్డారు మల్లాది విష్ణు.

ఇటు నెల్లూరులో మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడారు. ఇంటింటా మా న‌మ్మకం నువ్వే జ‌గ‌న్ అని ప్రజ‌లు నిన‌దిస్తున్నార‌ని మంత్రి కాకాణి అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండల కేంద్రంలోని శిడ్స్ కళ్యాణ మండపంలో నిర్వహించిన మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా గృహ సార‌ధులు, స‌చివాల‌య క‌న్వీన‌ర్లకు మంత్రి దిశానిర్దేశం చేశారు. మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు.

Read Also: Kim Jong-un: కిమ్ జాంగ్ ఉన్ హెచ్చరిక.. 48 గంటల్లోనే మరో క్షిపణి ప్రయోగం

Exit mobile version